టాప్ 5 టెస్ట్ టీం లో ఒకటి అయిన న్యూజిలాండ్ గత వారంలో పసికూన బంగ్లాదేశ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో అన్ని విభగాల్లో ఘోరంగా విఫలం అయ్యి అత్యంత చెత్త అపజయాన్ని మూటగట్టుకుంది. అది కూడా సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో ఓడిపోవడంతో కివీస్ మాజీలు మరియు ప్రేక్షకులు న్యూజిలాండ్ ను తిట్టిపోశారు, కొన్ని రోజుల వరకు విమర్శల వర్షాన్ని కురిపించారు. అయితే ఈ ఓటమితో దెబ్బతిన్న కివీస్ ఆటగాళ్లు మంచి ప్రణాళికలతో ముందుకు వచ్చారు. నిన్న క్రైస్ట్ చర్చ్ వేదికగా మొదలైన రెండవ టెస్ట్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కివీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

వారి నిర్ణయం ఎంత తప్పు అనేది తెలియడానికి ఎంతో సేపు పట్టలేదు. ఓపెనర్లు లాతమ్ మరియు యంగ్ ఆది నుండి బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో కివీస్ ఆటగాళ్లు బంగ్లా బౌలర్లను చీల్చి చెండాడారు. అలా మొదటి ఇన్నింగ్స్ లో కివీస్ 6 వికెట్ల నష్టానికి 521 పరుగుల చేసి డిక్లేర్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లా ఏ దశలోనూ కోలుకోలేదు. కివీస్ పేసర్ల దాటికి కేవలం 126 పరుగులకే కుప్పకూలిపోయింది. కివీస్ బౌలర్ బౌల్ట్ కెరీర్ లో 9 వ సారి అయిదు వికెట్లను తీసుకున్నాడు.

టిమ్ సౌథీ 3 మరియు జెమీసన్ 2 వికెట్లతో బౌల్ట్ కు చక్కటి సహకారం అందించారు. బంగ్లాదేశ్ ఇంకా 395 పరుగులు వెనుకబడి ఉంది. ఈ రోజుతో ఆత్త ముగిసింది కాగా, రేపు కివీస్ బంగ్లాకు ఫాలో ఆన్ ఆడే ఛాన్స్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే. మొదటి టెస్ట్ లో ఎదురైనా పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే దిశగా కివీస్ వెళుతోంది. మరి దెబ్బకు దెబ్బ తీస్తుందా లేదా బంగ్లాదేశ్ ఏమైనా ప్రతిఘటిస్తుందా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: