మరి కొందరు తాము ఊహించని ధర కంటే ఎక్కువగా అమ్ముడుపోవడంతో షాక్ కు గురయ్యారు. అయితే ఈ వేలంలో ఊహించని ధరకు అమ్ముడుపోయానని తన ఫీలింగ్ ను పంచుకుంటున్నాడు తెలుగు కుర్రాడు. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో చూద్దాం... హైద్రాబాద్ కు చెందిన లెఫ్ట్ హ్యాండ్ క్రికెటర్ తిలక్ వర్మ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. దేశవాళీ లీగ్ లలో ఈ మధ్య రాణిస్తున్న యువ ఆటగాళ్లలో తిలక్ వర్మ ఒకడు. అందరిలాగే ఇతను కూడా ఐపీఎల్ వేలంలో కొనుగోలు కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. కానీ మొదటి రోజు జరిగిన వేలం ప్రక్రియను చూసిన తిలక్ నేను అమ్ముడుపోవడం ఇక కష్టమే అనుకున్నాడని తెలిపాడు.
అలా మొదటి రోజు వేలం పూర్తి అయింది. ఇక రాత్రంతా ఒకటే టెన్షన్ అని తన మాటల్లో చెప్పాడు తిలక్ వర్మ. నిన్న జరిగిన వేలంలో ముంబై ఇండియన్స్ నన్ను ఒక కోటి 70 లక్షల రూపాయలకు కొనగానే.... ఇక మాటల్లేవు. ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని చెప్పాడు. ఇప్పుడు తిలక్ వర్మ ఎలాగైనా వచ్చిన ఈ సువర్ణావకాశాన్ని వాడుకుని త్వరలోనే ఇండియన్ టీమ్ లోకి వస్తానని నమ్మకంగా ఉన్నాడు. అయితే ఈ వ్యాఖ్యల అనంతరం క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది. ఏంటీ... ఐపీఎల్ వేలంలో అమ్ముడు పోగానే ఇండియన్ క్రికెట్ లో సెలెక్ట్ అయినట్లు అనుకుంటే ఎలా అంటూ తిలక్ ను అడుగుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి