ఐపీఎల్లో 96 పరుగుల వద్ద ఔట్ కావడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడిన సమయంలో 2019లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 96 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు డూ ప్లేసెస్. 2021 ఐపీఎల్ సీజన్లో కోల్కతా తో జరిగిన మ్యాచ్ లో చెన్నై కి ప్రాతినిధ్యం వహించిన డుప్లెసిస్ 95 పరుగుల వద్ద నాటౌట్గా నిలిచి సెంచరీ మార్క్ అందుకోలేకపోయాడు. ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 88 పరుగులు చేసి సెంచరీకి కాస్త దూరం లో అవుట్ అయిపోయాడు.
ఇలా డూప్లేసెస్ భారీగా పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర వహిస్తూ ఉన్నప్పటికీ అతనికి సెంచరీ కల మాత్రం నెరవేరడం లేదు అన్నది తెలుస్తుంది. ఎంతో దూకుడుగా ఆడుతూ సెంచరీ చేసే లాగే కనిపించిన డుప్లెసిస్ ఒక్క అడుగు దూరంలో చివరికి సెంచరీ చేజార్చుకుంటు ఉండడం గమనార్హం. ఇలా ఇప్పటివరకు ఐపీఎల్లో నాలుగు సార్లు సెంచరీ అవకాశం వచ్చినప్పటికీ మూడు సార్లు అవుట్ గా.. ఇక ఒక సారి నాటౌట్ గా మిగిలి సెంచరీ అందుకోలేకపోయాడు. దీంతో ఇది తెలిసిన క్రికెట్ అభిమానులు డూప్లెసిస్ కు సెంచరీ చేసి యోగ్యం లేనట్టుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. చూడాలి తర్వాత మ్యాచ్లలో అయినా డుప్లెసిస్ సెంచరీ సాధిస్తాడో లేదో అని.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి