ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్లో భాగంగా రిషబ్ పంత్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పడుతూ లేస్తూ ప్రస్థానాన్ని  కొనసాగిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్న ఓపెనర్ పృథ్వీ షా ఇటీవలే జ్వరం బారిన పడి ఆస్పత్రి పాలయ్యాడు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన మ్యాచ్ లకు దూరమయ్యాడు పృథ్వీ షా. టైపాయిడ్ బారిన పడ్డాడని.. అతని ఆరోగ్యం గురించి ఇప్పటికే వైద్యులు క్లారిటీ ఇవ్వలేదని రిషబ్ పంత్ తెలిపాడు.


 ఇక తర్వాత మ్యాచ్ లలో అతడు ఆడతాడా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై కూడా ఇప్పటికీ క్లారిటీగా చెప్పలేమూ అంటు ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్  చెప్పడంతో అందరూ కూడా ఆందోళనలో మునిగిపోయారు. ఇకపోతే ప్రస్తుతం ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవడానికి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్రతి మ్యాచ్కి గెలవల్సిన అవసరం ఉందన్న విషయం తెలిసిందే. కాగా ఈ సోమవారం మే 16వ తేదీన పంజాబ్ కింగ్స్ తో జరగబోయే మ్యాచ్ కు అటు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి శుభవార్త అందించి అన్నది తెలుస్తుంది. ఏకంగా  ఓపెనర్ పృథ్వీ షా  ఇటీవల ఆస్పత్రి పాలు కాగా జ్వరం బారి నుంచి కోలుకుని జట్టులోకి చేరాడు అన్నది తెలుస్తుంది.


 ఇకపోతే ఈ ఏడాది ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ గా పృథ్వీ షా  అద్భుతంగా రాణిస్తూ ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ప్రతి మ్యాచ్లో కూడా మంచి ఆరంభాన్ని ఇచ్చాడు పృథ్వీ షా.  గత మూడు మ్యాచ్లకు పృథ్వీషా దూరం కావడంతో ఇక ఢిల్లీ జట్టుకు సరైన ఆరంభం లభించలేదనే చెప్పాలి  పృథ్వీ షా స్థానంలో వచ్చిన శ్రీకర్ భారత్ తీవ్రంగా నిరాశ పరుస్తూనే ఉన్నాడు. ఇలా ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్ లలో రెండు హాఫ్ సెంచరీలను కలుపుకుని మొత్తం 259 పరుగులు చేశాడు పృథ్వీ షా..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl