ప్రపంచ క్రికెట్లో ఛాంపియన్ జట్టుగా కొనసాగుతున్న ఇంగ్లాండ్ జట్టు లో గత కొంతకాలం నుంచి అనూహ్యమైన మార్పులు జరుగుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే టెస్టు జట్టు కెప్టెన్సి విషయంలో కోచింగ్ స్టాఫ్ విషయంలో కూడా మార్పులు జరిగాయ్. టెస్టు జట్టు కెప్టెన్ గా ఉన్న జో రూట్ తప్పుకోవడంతో ఇక కీలక ఆటగాడిగా కొనసాగుతున్న బెన్ స్టోక్స్  కు సారథ్య బాధ్యతలు అప్పగించింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. అదే సమయంలో ఇక ఇంగ్లాండ్ జట్టుకు హెడ్ కోచ్గా సౌత్ ఆఫ్రికా దిగ్గజం మెకల్లమ్ ఎంట్రీ ఇచ్చాడు.


 ఎన్నో రోజుల తర్వాత బెన్స్ జోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు టెస్టుల్లో అదరగొడుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక పోతే ఇలాంటి సమయంలోనే అటు పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ఇయాన్ మోర్గాన్ కూడా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు తెలిపాడు. దాదాపు 13 ఏళ్ల పాటు ఇంగ్లాండ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఇయాన్ మోర్గాన్ కెప్టెన్గా ఏకంగా ఇంగ్లండ్ జట్టుకు ఒక వరల్డ్ కప్ కూడా అందించాడు. ఇక అంతే కాదు నైరాశ్యంలో మునిగిపోయిన ఇంగ్లాండ్ క్రికెట్ కు సరికొత్త ఊపిరి పోశాడు. మరోసారి ఇంగ్లాండ్ జట్టును ప్రపంచ క్రికెట్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.


 ఇటీవలే ఇయాన్ మోర్గాన్  రిటైర్మెంట్ ప్రకటించడం తో పరిమిత ఓవర్ల ఫార్మాట్ కెప్టెన్సీ స్థానం ఖాళీ అయింది. ఈ క్రమంలోనే ఇక ఇయాన్ మోర్గాన్ స్థానంలో ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టుకి కొత్త కెప్టెన్ నియమించాల్సిన అవసరం రావడంతో ప్రస్తుతం వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్న వికెట్కీపర్  కం బ్యాట్స్మన్ అయిన జోస్ బట్లర్ ను ఇంగ్లాండ్ టీ20 వన్డే కెప్టెన్ గా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.  2015 నుంచి జోస్ బట్లర్ పరిమిత ఓవర్ల ఫార్మాట్ కు వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.  ఇక ఇప్పుడు కెప్టెన్సీ అందుకున్నాడు. అయితే 31 ఏళ్ళ బట్లర్ 151 వన్డేల్లో 4120 పరుగులు చేశాడు. ఇందులో 10 శతకాలు 21 శతకాలు ఉండటం గమనార్హం. ఇక 88 టి-20లలో జోస్ బట్లర్  2451 పరుగులు సాధించాడు అని చెప్పాలి.ఇక ప్రస్తుతం ఫుల్ ఫాంలో కొనసాగుతున్న జోస్ బట్లర్ అటు కెప్టెన్గా కూడా సక్సెస్ అవుతాడని ఎంతో మంది మాజీ క్రికెటర్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: