
ఈ క్రమంలోనే భారత్లో కూడా ఎంతో మంది ప్రేక్షకులు డేవిడ్ వార్నర్ ని అభిమానించడం మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో భారత హీరోల సినిమాల పాటలపై డాన్సులు చేస్తూ మరింత క్రేజ్ సంపాదించాడు. అయితే ఇలా క్రికెట్లో అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతున్న వార్నర్ జీవితంలో ఒక పీడ కల లాంటి రోజు కూడా ఉంది అన్న విషయం తెలిసిందే. అదే బాల్ టాంపరింగ్ వివాదం. 2018లో దక్షిణాఫ్రికా పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు వెళ్లిన సమయంలో బాల్ టాంపరింగ్ వివాదంలో అటు డేవిడ్ వార్నర్ తోపాటు అప్పుడు జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న స్టీవ్ స్మిత్ పై కూడా రెండేళ్ళపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు.
ఇక అదే సమయంలో ఒక జీవితకాలం పాటు డేవిడ్ వార్నర్ కెప్టెన్సీపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. అటు స్మిత్ పై మాత్రం ఇలాంటి నిషేధం లేదు. ఇక ఇటీవల ఇదే విషయంపై స్పందించిన డేవిడ్ వార్నర్ భార్య క్యాండీస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆల్ టైమ్ లీడర్ షిప్ బ్యాన్ పై ఎత్తివేయక పోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఈ నిషేధం నుంచి స్మిత్ కు మినహాయింపు ఇచ్చే వార్నర్ కు ఇవ్వకపోవడం దారుణమని పేర్కొంది. ఇది వార్నర్ ను ఎంతో బాధించిందని.. అతడు మళ్లీ యూఏఈ ఇండియాలో కెప్టెన్సీ చేపట్టగలడు అంటూ చెప్పుకొచ్చింది.