గత కొంత కాలం నుంచి టీమిండియాలో ప్రయోగాలకు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. టీమిండియా ఆడే ఏ మ్యాచ్ లో ఏ ఆటగాడు ఆడతాడు ఇక మ్యాచ్ లో జట్టుకి ఎవరు కెప్టెన్ గా వ్యవహరిస్తారు అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంది అని చెప్పాలి. గత కొంత కాలం నుంచి టీమిండియాలో జరుగుతున్న మార్పులు ప్రేక్షకులు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్లు వరుస మ్యాచ్లతో అలసిపోకుండా ఉండేలా వరుసగా విశ్రాంతి ప్రకటిస్తూ వస్తుంది బీసీసీఐ.


 ఈ క్రమంలోనే యువ ఆటగాళ్లు జట్టులోకి రావడమే కాదు కొత్త కెప్టెన్ లు కూడా సారథ్య బాధ్యతలు చేపడుతున్నారు. అయితే గత కొంత కాలం నుంచి వరుసగా విదేశీ పర్యటనలకు వెళ్తూ అక్కడ సిరీస్ లూ టీమిండియా ఆడుతోంది. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే వెస్టిండీస్ పర్యటనకు వచ్చింది. అయితే ఇక వెస్టిండీస్ పర్యటనలో ఇప్పటికే వన్డే సిరీస్ ముగియగా టి20 సిరీస్ ఆడుతుంది. ఈ టి 20 సిరీస్ ముగిసిన కొన్నాళ్ల విరామం తర్వాత ఆగస్టు 18వ తేదీన జింబాబ్వే పర్యటనకు వెళ్లనుంది అని తెలుస్తోంది.


 జింబాబ్వే పర్యటనలో భాగంగా మూడు వన్డేలు ఆడబోతుంది. ఇక జింబాబ్వే పర్యటన కోసం ఇటీవలే భారత సెలెక్టర్లు 15 మంది సభ్యుల బృందాన్ని ప్రకటించారు. ఇక మరోసారి రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సీనియర్ లూ మహ్మద్ షమీ, జస్ప్రిత్ బూమ్రా, రవీంద్ర జడేజా, శ్రేయస్ అయ్యర్, దినేష్ కార్తీక్,  భువనేశ్వర్ కుమార్ లకు విశ్రాంతి కల్పించారు సెలెక్టర్లు. ఈ క్రమంలోనే వెస్టిండీస్ పర్యటనలో కెప్టెన్ గా అదరగొట్టిన శిఖర్ ధావన్ కే జింబాబ్వే పర్యటనలో కెప్టెన్సీ అప్పగించడం గమనార్హం. జింబాబ్వే పర్యటన కోసం విరాట్ కోహ్లిని ఎంపిక చేస్తారని భావించినప్పటికీ  విశ్రాంతిని పొడిగిస్తూ సెలెక్టర్లు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇక జింబాబ్వేలో 18, 20, 22 తేదీలలో మూడు మ్యాచ్లు జరగబోతున్నాయి.

భారత జట్టు...
శిఖర్ ధవన్ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, అవేష్ ఖాన్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, దీపక్ చహర్.

మరింత సమాచారం తెలుసుకోండి: