అయితే ఇటీవల ఆసియా కప్లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మొదటి మ్యాచ్లో ఘన విజయాన్ని అందుకుంది టీమిండియా జట్టు. ఇక ఇటీవల పాకిస్థాన్తో సూపర్ 4 లో మరోసారి మ్యాచ్ ఆడింది. కేవలం వారం వ్యవధిలో రెండుసార్లు దాయాదుల పోరు జరగడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అయితే మొదటి మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే ఇటీవల సూపర్ 4 లో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా రోహిత్ శర్మ 28 కె.ఎల్.రాహుల్ 28 పరుగులతో రాణించారు.
రిషబ్ పంత్ హార్దిక్ పాండ్యా నిరాశపరిచారు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ 19.5 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి టార్గెట్ చేసింది. దీంతో విజయం సాధించింది. అయితే భారత జట్టు ఓడిపోయినప్పటికీ భారత ఓపెనింగ్ జోడీ మాత్రం పాకిస్థాన్పై అరుదైన రికార్డు సృష్టించింది. మొదటి ఓవర్ నుంచి సిక్సర్లు పొరలతో చెలరేగిపోయిన నేపథ్యంలో తొలి వికెట్కు 54 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఫలితంగా భారత్ పవర్ ప్లే లో ఒక వికెట్ కోల్పోయి 68 పరుగులు చేసింది. తద్వారా టి20 లలో పాకిస్థాన్పై భారత్ అత్యధిక స్కోరు నమోదు చేసింది. 2012లో పాకిస్తాన్పై భారత్ ఒక వికెట్ నష్టపోయి 48 పరుగులు చేసింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి