ఇటీవలి కాలం లో బిసిసీఐ  స్థాయి ఏ రేంజ్ లో పెరిగి పోయిందో ప్రత్యేకం గా చెప్పాల్సిన పని లేదు. మొన్నటికి మొన్న జరిగిన ఐపీఎల్ ప్రసార హక్కుల వేలం కారణంగా బిసిసిఐకి ఊహించని రీతిలో ఆదాయం వచ్చింది. తద్వారా ప్రతి ఏడాది ప్రేక్షకులు అందరినీ అలరిస్తున్న ఐపీఎల్ లో మరింత కొత్తగా ప్రేక్షకులు ఆస్వాదించే విధంగా చేయాలనే ఉద్దేశం తో వినూత్నమైన నిర్ణయాలకు శ్రీకారం చుడుతుంది బీసీసీఐ. ఈ క్రమం లోనే ఇక ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన నేపథ్యం లో ఇప్పటి నుంచి వచ్చే ఏడాది ఐపీఎల్ కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి అని చెప్పాలి.


 ఈ క్రమం లోనే ఇక క్రికెట్ ప్రేక్షకులకు మునుపెన్నడూ లేని విధం గా ఎంటర్టైన్మెంట్ పంచడమే లక్ష్యం గా ప్రణాళికా బద్ధం గా ముందుకు సాగుతోంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ క్రమం లోనే ఐపీఎల్ మ్యాచ్ లు ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై కూడా ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నారు అనేది తెలుస్తుంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ పరిస్థితి సద్దుమణిగిన నేపథ్యం లో మునుపటి లాగానే భారత్లోని అన్ని వేదికలపై కూడా ఐపీఎల్ నిర్వహిస్తారని అందరూ భావించారు.


 హైదరాబాద్ లో ఏడాది నిర్వహించబోయే ఐపీఎల్ సీజన్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్వదేశంలో కొన్ని మ్యాచ్ లు నిర్వహించడానికి  సుముఖత తో  ఉందట. అదే సమయంలో విదేశాల్లో మరికొన్ని మ్యాచ్ లు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇలా కరోనా  పరిస్థితులు సద్దుమణిగినప్పటికీ భారత్ లో కొన్ని విదేశాలలో కొన్ని మ్యాచ్ లు నిర్వహించడం ద్వారా ఐపీఎల్ ఎంటర్ టైన్ మెంట్ ను మరింత కొత్తగా ప్రేక్షకులకు అందించాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రచారం నేపథ్యంలో బిసిసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: