గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాకు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ లో బాగా రాణించాలని ప్రణాళికలను సిద్ధం చేసుకున్న టీమిండియా యాజమాన్యం ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అవుతూనే ఉన్నాయి. ఎందుకంటే జట్టులో కీలక ఆటగాళ్లుగా కొనసాగుతున్న వారు చివరికి గాయాల బారిన పడుతూ జట్టుకు దూరం అవుతూ ఉన్నారు అని చెప్పాలి. దీంతో వారి స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలో తెలియక సెలక్టర్లు తలలు పట్టుకుంటున్న పరిస్థితి ఏర్పడింది.


 ఇప్పటికే రవీంద్ర జడేజా లాంటి కీలకమైన ఆటగాడు దూరం కావడంతో టీమిండియా కష్టాల్లో పడిపోయింది. అతని స్థానంలో అక్షర పటేల్ తీసుకున్నప్పటికీ అతడు జడేజా స్థానాన్ని ఎంతవరకు భర్తీ చేయగలడు అన్నది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే ఇక జస్ ప్రీత్ బుమ్రా జట్టులో ఉండడం టీమిండియా కు కాస్త బలం అనే చెప్పాలి  కానీ ఇప్పుడు ఆ బలం కూడా జట్టుకు దూరమైంది  వెన్ను నొప్పి కారణంగా మొన్నటి వరకు జట్టుకు దూరమైన బుమ్రా మళ్ళీ జట్టులో చేరాడు. కానీ వెన్నునొప్పి మళ్ళీ వేధించడంతో చివరికి వరల్డ్ కప్ కి జట్టుకు దూరంగా ఉండబోతున్నాడు అన్నది తెలుస్తుంది.


 ఇక మరోవైపు టి20 వరల్డ్ కప్ లో స్టాండ్ బై ప్లేయర్గా ఎంపికైన మహమ్మద్ షమీ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాలతో జరిగే టి20 సిరీస్లో బాగా రాణించి తుదిచెట్టులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ ఈ సిరీస్ లు ఆరంభానికి ముందు కరోనా వైరస్ బారిన పడ్డాడు. కానీ ఇప్పుడు టీమిండియా కు గుడ్ న్యూస్ అందింది. కరోనా బారిన పడ్డ శమీ కోలుకున్నాడట. ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షలలో నెగిటివ్ రిపోర్టు వచ్చిందట. అయితే కరోనా నుంచి కోలుకున్నప్పటికీ ఫిట్నెస్ సాధించలేని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఫిట్నెస్ సాధించాక అతను వరల్డ్ కప్ జట్టులోకి వస్తాడో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: