భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్లో సృష్టించిన రికార్డులు అన్ని ఇన్ని కావు అని చెప్పాలి. ఎంతోమంది దిగ్గజ క్రికెటర్లు సాధించిన రికార్డులను సైతం అలవోకగా చేధించి ప్రపంచ క్రికెట్లో తన పేరు మారుమోగిపోయేలా చేసుకున్నాడు. ఇక ఇన్నాళ్ళ వరకు విరాట్ కోహ్లీ సాధించిన ఎన్నో రికార్డులు పదిలంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు భారత దాయాది దేశమైన పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న బాబర్ అజాం మాత్రం విరాట్ కోహ్లీ రికార్డులను వరుసగా బద్దలు కొడుతూ ఉండడం గమనార్హం.


 గత కొంతకాలం నుండి చూసుకుంటే కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టడమే పనిగా బాబర్ అజాం టార్గెట్ పెట్టుకున్నాడెమో అని అనిపిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఇప్పటికే తన ఆట తీరుతో కోహ్లీ సాధించిన పలు  రికార్డులను బద్దలు కొట్టిన బాబర్ అజాం ఇక ఈ రికార్డుల వేట కొనసాగిస్తూనే ఉన్నాడు. మొన్నటి వరకు పేలవమైన ఫామ్ లో ఇబ్బంది పడిన బాబర్ అజాం మళ్లీ మునుపటి లయను అందుకున్నాడు అన్న విషయం తెలిసిందే.దీంతో మరోసారి పరుగుల వరద పారిస్తున్నాడు. ఇక పాకిస్తాన్ జట్టు విజయాలలో కీలక పాత్ర వహిస్తున్నాడు.


 ఇక ఇటీవలే కోహ్లీ సాధించిన మరో రికార్డును పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం సమం చేశాడు. అంతర్జాతీయ టి20 లలో 81 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ 3000 పరుగుల మైలు రాయిని అందుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం కూడా 81 ఇన్నింగ్స్ లోనే 3000 పరుగులు పూర్తి చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ఇటీవల ఇంగ్లాండుతో జరిగిన ఆరవ టీ20 లో భాగంగా 87 రన్స్ చేయడంతో ఇక ఈ రికార్డును అందుకున్నాడు బాబర్ ఆజం. 59 బంతుల్లో మూడు సిక్సర్లు ఏడు ఫోర్ల సహాయంతో 87 పరుగులు చేశాడు. అంతేకాదు తన టి20 కెరియర్ లో 29వ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: