టీమిండియా వరుస విజయాలకు బ్రేకులు వేసే ప్రత్యర్థి జట్టు లేకుండా పోయింది అన్నది మాత్రం ప్రస్తుతం అర్థమవుతుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి పొట్టి ఫార్మట్ లో టీమిండియా అదిరిపోయే ప్రస్తానాని కొనసాగిస్తుంది. ప్రత్యర్థి జట్టు ఎవరైనా సరే ఆధిపత్యాన్ని చెలాయిస్తూ చిత్తుగా ఓడిస్తూ ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే టీమ్ ఇండియా అభిమానులు అందరూ కూడా తమ అభిమాన జట్టు విజయాలు చూసి ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.


 మొన్నటికి మొన్న భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్టుతో మూడు టి20 ల  సిరీస్ ఆడిన భారత జట్టు రెండు విజయాలతో సిరీస్ కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇదే జోరులో భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో టి20 సిరీస్ ఆరంభించింది. ఈ క్రమంలోనే తిరువనంతపురం వేదికగా జరిగిన మొదటి టి20 మ్యాచ్లో విజయం సాధించింది. ఇక కాస్త గ్యాప్ తర్వాత నిన్న రెండవ టి20 మ్యాచ్ జరగగా..  సిరీస్లో నిర్ణయాత్మకమైన మ్యాచ్ అయిన రెండవ టి20 లో కూడా మరోసారి జోరు చూపించింది టీమిండియా. బ్యాటింగ్లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా బౌలింగ్ లో కూడా పరుగులు కట్టడి చేసింది.


 ఈ క్రమంలోని సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్ లో 16 పరుగుల తేడాతో విజయం సాధించింది అని చెప్పాలి. మొదట బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా సఫారీల ముందు 238 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఇందులో సూర్య కుమార్ యాదవ్ 61, కేఎల్ రాహుల్ 57 రోహిత్ శర్మ 43, విరాట్ కోహ్లీ 49 పరుగులతో రాణించారు. సఫారీ బ్యాటర్లలో డేవిడ్ మిల్లర్ 106 పరుగులతో సెంచరీ తో చెలరేగిన డికాక్ 69 పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా జట్టు మాత్రం చివరికి ఓడిపోయి సిరీస్ చేజార్చుకుంది. 2-0 తేడాతో సిరీస్ గెలుచుకుంది టీమ్ ఇండియా. ఇక మూడవ మ్యాచ్ నామమాత్రం అయినదిగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: