ప్రస్తుతం భారత పర్యటనకు వచ్చిన సౌత్ ఆఫ్రికా తో మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ఆడుతోంది టీమిండియా జట్టు. అయితే ఈ సిరీస్ లో భాగంగా టీమ్ ఇండియా అద్భుతమైన ప్రదర్శన చేసింది అని చెప్పాలి. వరుసగా రెండు మ్యాచ్లలో విజయం సాధించి సొంత గడ్డపై సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది టీం ఇండియా  టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు ఈ సిరీస్ విజయం అటు టీమిండియాలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ఇదిలా ఉంటే... మొదటి టీ20 మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా భారత బౌలర్ల దాటికి చేతులెత్తేసింది అన్న విషయం తెలిసిందే. కేవలం 106 పరుగులకు మాత్రమే పరిమితం అయింది. ఇక ఆ తర్వాత లక్ష్య చేదనలో టీమిండియా ఎంతో అలవోకగా టార్గెట్ చేదించింది. అయితే రెండవ టి20 మ్యాచ్ లో మాత్రం అటు సౌత్ ఆఫ్రికా గట్టి పోటీ ఇచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 238 పరుగులు లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు చెలరేగిపోయారు. ఏకంగా డేవిడ్ మిల్లర్ వీర విహారం చేశాడు అని చెప్పాలి. సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోయి 16 పరుగులు చేసి సెంచరీ తో అదరగొట్టాడు.


 ఇక మరోవైపు 69 పరుగులతో క్వింటన్ డికాక్ ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే డేవిడ్ మిల్లర్ క్వింటన్ డికాక్ ఒక అరుదైన రికార్డును సృష్టించారు. నాలుగో వికెట్ కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అంతర్జాతీయ టి20 ఫార్మాట్లో నాలుగో వికెట్ కు 174 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఆటగాళ్లుగా వీరిద్దరూ రికార్డు సృష్టించారు అని చెప్పాలి. అదే సమయంలో టి20 లలో ఓడిన మ్యాచ్లో సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా డేవిడ్ మిల్లర్ ఒక చెత్త రికార్డు క్రియేట్ చేశాడు . ఇక ఎంతో రసవత్తరంగా జరిగిన మ్యాచ్లో 16 పరుగులు తేడాతో టీమిండియా విజయం సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: