ఈ క్యాలెండర్ ఇయర్ లో అటు టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో ఇప్పటివరకు బిజీ బిజీగానే గడిపింది అని చెప్పాలి. ఇక ఇప్పుడు మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోయే టి20 వరల్డ్ కప్ వేదికగా తలబడేందుకు సిద్ధమవుతుంది అని చెప్పాలి. ఇక ఈసారి విశ్వవిజేతగా నిలిచి సత్తా చాటాలని భావిస్తుంది టీమిండియా. ఇక ఏడాది టీ20 వరల్డ్ కప్ లో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న జట్లలో ఒకటిగా కొనసాగుతుంది అని చెప్పాలి. ప్రపంచ కప్ జరిగినన్ని రోజులు అటు టీమిండియా ఇతర ద్వైపాక్షిక సిరీస్ లు ఆడలేదు అన్న విషయం తెలిసిందే.



 ఇకపోతే ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన వెంటనే అటు టీమిండియా మళ్లీ ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీ కాబోతుంది అన్నది తెలుస్తుంది.  కాగా వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్తో టి20 సిరీస్ తో పాటు వన్డే సిరీస్ కూడా జరగబోతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఇటీవల రిలీజ్ చేశారు . కాగా వరల్డ్ కప్ ముగిసిన వెంటనే న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతుందట టీమిండియ. అక్కడ వరుసగా సిరీస్ లు ఆడబోతుంది. నవంబర్ 18, 20, 22 తేదీలలో మూడు టి20 మ్యాచ్ లు.. 25, 27, 30 తేదీలలో మూడు వన్డే మ్యాచ్లు అటు న్యూజిలాండ్ వేదికగా జరగబోతున్నాయ్ అనేది తెలుస్తుంది.


 ఇకపోతే ప్రస్తుతం టైటిల్ గెలవడం లక్ష్యంగా పదునైన వ్యూహాలతో బరిలోకి దిగిన టీమిండియా అటు ప్రపంచ కప్ లో తొలి పోరు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో జరగబోతుంది. ఈనెల 23వ తేదీన ఇక దాయాదుల పోరు జరగబోతుంది అని చెప్పాలి. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో ఆసక్తిగా వీక్షిస్తున్నారు. కాగా టీమిండియా వరల్డ్ కప్ గెలవక దాదాపు 15 ఏళ్లు గడిచిపోతున్నాయి. ఈ క్రమంలోనే రోహిత్ కెప్టెన్సీలో మొదటిసారి బలిలోకి దిగుతున్న టీమ్ ఇండియా తప్పకుండా వరల్డ్ కప్ సాధిస్తుందని నమ్మకంతో ఉన్నారూ భారత క్రికెట్ అభిమానులు..

మరింత సమాచారం తెలుసుకోండి: