ఇటీవలే వరుస విజయాలతో టీమిండియా అదరగొడుతుంది అని అందరూ ఆనందపడుతున్న సమయంలో.. ఊహించని విధంగా టీమిండియా విజయాలకు బ్రేకులు పడ్డాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో జరిగిన మ్యాచ్లో టీమిండియా పేలవ  ప్రదర్శన చేసి చివరికి ఓటమి చవి చూసింది. అయితే ఇక వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నీలలో ప్రతి మ్యాచ్ కూడా ఎంతో కీలకంగా మారుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ మ్యాచ్ ని కూడా లైట్ తీసుకోవడానికి ఉండదు. ఇలాంటి సమయంలోనే ఇక రానున్న మ్యాచ్లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరిచి అదరగొట్టాలి అనుకుంటే మాత్రం జట్టులో పలుమార్పులు చేయాలని ఇప్పటికే ఎంతోమంది మాజీ ఆటగాళ్లు సూచిస్తూ ఉండడం గమనార్హం.



 ముఖ్యంగా ఓపెనర్ గా  అంచనాలను అందుకోలేకపోతున్న కేఎల్ రాహుల్ పై వేటు వేయాల్సిన అవసరం ఉంది అంటూ ఎంతో మంది మాజీ ఆటగాళ్లు అభిమానులు సైతం కోరుతూ ఉన్నారు. ఇక ఇటీవల ఇదే విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సైతం స్పందిస్తూ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల హార్బర్జన్ మాట్లాడుతూ రానున్న మ్యాచ్లలో టీమిండియా మేనేజ్మెంట్ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అంటూ హర్భజన్ సింగ్ వ్యాఖ్యానించాడు.


 కేఎల్ రాహుల్ గొప్ప ఆటగాడు అతను మ్యాచ్ విన్నర్ కూడా దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ తన పేలవమైన ఫాం ఇలాగే కొనసాగితే మాత్రం టీమిండియా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ హర్భజన్ సింగ్ సూచించాడు. అదే సమయంలో దినేష్ కార్తీక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దినేష్ కార్తీక్ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా రిషబ్ పంత్ ను తుదిచెట్టులోకి తీసుకుంటే బాగుంటుంది.  రాహుల్ పై వేటు వేసి ఇక రోహిత్ శర్మకు జోడిగా రిషబ్ పంత్ ను  ఓపెనింగ్ చేయించడం బెటర్ అంటూ హార్భజన్ సింగ్ తెలిపాడు.. ఇక అశ్విన్ స్థానంలో చాహాల్ ను తీసుకున్న కూడా మెరుగైన ఫలితాలు వస్తాయని సూచించాడు హర్భజన్ సింగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: