ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం ఒక విషయం గురించి చర్చించుకుంటుంది . అదే సెమీఫైనల్ లో భాగంగా భారత్ ఓటమి గురించి.. అదృష్టవశాత్తు ఫైనల్లో అడుగుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఇక విధ్వంసకరమైన ప్రదర్శనతో సెమి ఫైనల్ వరకు దూసుకు వచ్చిన న్యూజిలాండ్ ను మట్టి కరిపించి ఫైనల్ లో అడుగుపెట్టింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక రెండవ సెమీఫైనల్ మ్యాచ్లో తప్పక భారత్ గెలవాలని ఇక మరోసారి ఫైనల్ లో దాయాదుల పోరు జరగాలని క్రికెట్ ప్రపంచం మొత్తం కోరుకుంది.


 కానీ క్రికెట్ ప్రేక్షకుల అందరి ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. ఇంగ్లాండ్ పై అద్భుతమైన విజయం సాధించి భారత జట్టు ఫైనల్ కు చేరుకుంటుంది అని అందరూ నమ్మకం పెట్టుకుంటే.. అటు టీమిండియా మాత్రం సెమీఫైనల్ లోనే ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. 10 వికెట్ల తేడాతో ఘోర ఓటమిని చవిచూసింది. కనీస పోటీ ఇవ్వలేక చేతులు ఎత్తేసింది అని చెప్పాలి. అయితే ఇంగ్లాండ్ జట్టు ముందు అటు టీమిండియా 168 పరుగులతో ఒక మంచి టార్గెట్ ఉంచినప్పటికీ ఇంగ్లాండు ఓపెనర్ల విధ్వంసం ముందు ఈ టార్గెట్ చాలా చిన్నదిగా మారిపోయింది.  ఇక టీమిండియా ఓడిపోవడంతో అభిమానులు నిరాశలో మునిగిపోయారు.



 ఇదిలా ఉంటే.. అటు టి20 వరల్డ్ కప్ లో భాగంగా సెమీఫైనల్ లో ఓడిన భారత జట్టును గిన్నిస్ వరల్డ్ రికార్డు సంస్థ దారుణంగా అవమానించే విధంగా ఒక పోస్ట్ పెట్టడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది. అంతేకాదు భారత అభిమానులను ఆగ్రహానికి గురిచేస్తుంది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత ఓటమిని దారుణమైన ఓటమిగా అభివర్ణిస్తూ క్రికెట్ చరిత్రలో అత్యంత సునాయాసమైన లక్ష్య చేదన అంటూ భారతీయుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా పోస్ట్ పెట్టింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సంస్థ. దీంతో గిన్నిస్ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీమిండియా ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc