సాధారణంగా భారతదేశంలో క్రికెట్ కి ఎనలేని పాపులారిటీ ఉంది అన్న విషయం విషయం తెలిసిందే. ఏకంగా క్రికెటర్లను ప్రేక్షకులు అందరూ ఎంతగానో ఆరాధిస్తూ ఉంటారు. భారత జాతీయ క్రీడ హాకీ అయినప్పటికీ ఇక విదేశీ క్రీడా అయినా క్రికెట్ నే ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు ప్రేక్షకులు. అయితే క్రికెట్ తర్వాత ఆ రేంజ్ లో గ్రేట్ సంపాదించుకుంది ఫుట్ బాల్ అని చెప్పాలి. సాధారణంగా ప్రపంచ దేశాలలో క్రికెట్ ను మించిన క్రేజ్ సంపాదించుకుంది ఫుల్ బాల్. కానీ మనదేశంలో ఎందుకో ఫుట్ బాల్ కి మాత్రం క్రికెట్ స్థాయిలో క్రేజ్ లేదు అని చెప్పాలి.


 ఇకపోతే ఇటీవలే ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా అన్ని మ్యాచ్లు హోరాహోరీ గా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సాధారణంగా టి20 వరల్డ్ కప్ జరిగినప్పుడు దేశంలో ఎలాంటి హడావిడి ఉంటుందో.. ఇక ఇప్పుడు ఖతార్ వేదికగా ఫిఫా వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు కూడా అంతే హడావిడి ఉంది అని చెప్పాలి. అయితే ఈ హడావిడి కేవలం కేరళ రాష్ట్రానికి మాత్రమే పరిమితం అయింది అని చెప్పాలి.


 కేరళలో ఫుట్బాల్ అంటే చాలు క్రికెట్ కంటే ఎక్కువగా పిచ్చెక్కిపోతారు. ప్రేక్షకులు ఇలా కేరళలో ఫుట్బాల్ కి ఇంత క్రేజ్ ఎందుకు ఉంది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే బ్రిటిషర్ల కంటే ముందే మన దేశానికి పోర్చుగల్ దేశస్తులు వచ్చారు. ఇక వాళ్లు మన దేశంలోకి వస్తున్న సమయంలో ముందుగా కేరళలో అడుగు పెట్టడంతో అక్కడ ఇక ఫుడ్ బాల్ ఆట ఫేమస్ అయింది. ఇక కేరళ నుంచి ఎంతోమంది గల్ఫ్ దేశాలకు వెళ్లడం.. ఇక అక్కడ ఫుట్బాల్ కి క్రేజ్ ఉండడంతో.. ఇక ఆ క్రేజ్ కేరళ వరకు పాకింది అని చెప్పాలి. ముఖ్యంగా అర్జెంటిన, బ్రెజిల్ దేశాలకే కేరళలో ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: