ఈ క్రమంలోనే ఎంతో ఉత్కంఠ భరితంగా జరిగిన మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. ఇలాంటి సమయంలోనే మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ లో భాగంగా రెండవ మ్యాచ్లో పాకిస్తాన్ గెలిచి సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంటుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో పాకిస్తాన్ పై రెండవ మ్యాచ్ లో కూడా కూడా విజయం సాధించింది ఇంగ్లాండు జట్టు. దీంతో ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇలా టెస్టు సిరీస్ కైవసం చేసుకున్న ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై చరిత్ర సృష్టించింది. దాదాపు 22 ఏళ్ల తర్వాత తొలిసారి టెస్ట్ సిరీస్ ను కైవసం చేసుకుంది ఇంగ్లీష్ జట్టు. ఈ క్రమంలోనే అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండవ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్ గడ్డపై చివరిసారిగా 2000 సంవత్సరంలో ఇక టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది అని చెప్పాలి.. అయితే పాకిస్తాన్ సిరీస్ కోల్పోవడమే కాదు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ నుంచి కూడా నిష్క్రమించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి