ఇటీవల కాలంలో భారత్ జట్టులో ఉన్న ఎంతో మంది కీలక ప్లేయర్స్ గాయాల బారిన పడుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఎంతో మంది యువ ఆటగాళ్ళు ఇక జట్టులో చోటు సంపాదించుకుంటూన్నారు. దేశవాళీ టోర్నీలలో మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లు అందరూ భారత జట్టులో చోటు సంపాదించుకుంటూ ఉండటం గమనార్హం. ఈ క్రమంలోనే దాదాపు 12 ఏళ్ల సుదీర్ నిరీక్షణ తర్వాత అటు లెఫ్ట్ ఆర్మ్ పేసర్ అయిన జయదేవ్ ఉన్నద్గత్ అటు భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు.


 ఇటీవల కాలంలో దేశవాళి టోర్నిలలో మంచి ప్రదర్శన చేసి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించిన జయదేవ్  భారత జట్టులో చోటు సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక అతని ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. అయితే భారత జట్టులో చోటు సంపాదించుకున్నప్పటికీ అతనికి వీసా సమస్యలు వచ్చిన నేపథ్యంలో ఇక మొదటి టెస్టుకు అందుబాటులో లేకుండానే పోయాడు.  కానీ ఇక ప్రస్తుతం జరుగుతున్న రెండవ టెస్టులో మాత్రం జయదేవ్  అటు భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు  అని చెప్పాలి.


 దీంతో అతని ప్రదర్శన ఎలా ఉంటుందో అన్నదానిపైనే అందరి దృష్టి ఉండగా.. ఇక తన లెగ్స్ పిన్ పేస్ బౌలింగ్ తో అదరగొట్టాడు అని చెప్పాలి. దాదాపు 12 ఏళ్ల విరామం తర్వాత బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ లో రెండో టెస్టులో అవకాశం దక్కించుకున్న జయదేవ్  పన్నెండేళ్ల తర్వాత తర్వాత మొదటి వికెట్ సాధించాడు. 14వ ఓవర్లో మూడో బంతికి జాకీర్ హాసన్  కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అని చెప్పాలి. దీంతో పుష్కరం తర్వాత వికెట్ తీయడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. అతని అభిమానులు కూడా అతడు 12 ఏళ్ల తర్వాత మొదటి వికెట్ తీయడంతో అందరూ ఆనందంలో మునిగిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: