టీమిండియాలో స్టార్ క్రికెటర్ గా కొనసాగుతున్న వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఇటీవల రోడ్డు ప్రమాదం బారిన పడ్డాడు అన్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్లోని రూర్కీ ప్రాంతంలో తెల్లవారుజామున అతని కారు ఘోర ప్రమాదానికి గురైంది. ఇక ఈ ప్రమాదంలో అతని కారు అక్కడికక్కడే కాళీ బూడిదైంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ప్రమాదం జరగడానికి కొన్ని సెకండ్ల ముందు ఒక కారులోంచి దూకడంతో కేవలం గాయాలతో బయటపడ్డాడు పంత్. ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు అని చెప్పాలి.


అయితే రిషబ్ పంత్ ఇక రోడ్డు ప్రమాదం బారిన పడి తీవ్ర గాయాల పాలైన నేపథ్యంలో అటు అభిమానులు అందరూ ఆందోళనలో మునిగిపోయారు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు రిషబ్ పంత్. ఇక మొన్నటి వరకు ఐసీయూలో ఉండగా ఇక అప్పుడు ప్రైవేట్ వార్డుకు తరలించినట్లు వైద్యులు కూడా తెలిపారు. ఇక అతను వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ వర్గాలు కూడా తెలిపాయి. అయితే ఇక యాక్సిడెంట్ బారిన పడిన రిషబ్ పంత్ అటు ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ లకు దూరం కాబోతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే గాయాల నుంచి కోలుకొని రిషబ్ పంత్ మళ్లీ ఇప్పుడు జట్టుకు అందుబాటులోకి వస్తాడు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ప్రస్తుతం ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పంత్ ఆరోగ్య పరిస్థితి పై బీసీసీఐ  అధికారి ఇటీవలే మాట్లాడాడు. పంతు కోలుకునేందుకు కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే శ్రీలంక న్యూజిలాండ్తో జరిగే వైట్ బాల్ సిరీస్ లు.. అంతే కాకుండా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్. ఇక ఆ తర్వాత జరిగే ఐపీఎల్ కూడా ఆడటం కష్టమే అంటూ చెప్పుకొచ్చారు.  కానీ ఈ ఏడాదిలో భారత్ వేదికగా జరిగే వరల్డ్ కప్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు సదరు బీసీసీఐ అధికారి.

మరింత సమాచారం తెలుసుకోండి: