
ఇదిలా ఉంటే మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్లు కూడా వరుసగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇక ఐపీఎల్ లో భాగమైన విదేశీ క్రికెటర్లు ఎంతోమంది గాయం బారిన పడుతూ జట్టుకు దూరమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ఏడాది ఐపీఎల్ టైటిల్ గెలవడమే లక్ష్యంగా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్న జట్లకు ఊహించని ఎదురూదెబ్బలు తగులుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా జట్టులో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న ఫేసర్ జాయ్ రిచర్డ్ సన్ ఐపీఎల్ మొత్తానికి దూరం కాబోతున్నాడు అన్నది తెలుస్తుంది.
అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ముంబై ఇండియన్స్ కు జాయ్ రిచర్డ్ సన్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. కానీ ఇటీవల తుంటి గాయం బారిన పడ్డాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ కు దూరమయ్యాడు. దీనిపై స్పందిస్తూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ కు దూరం కావడం బాధగా ఉంది. త్వరలోనే కోలుకొని వచ్చే సీజన్ లో మెరుగైన ఆటగాడికి వస్తాను అంటూ జాయ్ రిచర్డ్ సన్ చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటికే బుమ్రా లాంటి కీలక బౌలర్ దూరం కావడంతో ముంబై ఇండియన్స్ కు ఎదురుదెబ్బ తగలగా.. ఇప్పుడు మరో స్టార్ బౌలర్ దూరమవడంతో ముంబై ఇండియన్స్ జట్టు మరింత బలహీనంగా మారిపోయింది అని చెప్పాలి.