
ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ లో ఫేస్ ఆల్ రౌండర్ గా కొనసాగుతున్న శివం దూబే ఆట తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ. చెన్నై సూపర్ కింగ్స్ ఓడిపోయింది అంటే దానికి కారణం కేవలం శివం దూబే మాత్రమే అంటూ అతని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలు పెడుతున్నారు. జిడ్డు బ్యాటింగ్ తో ఇక జట్టు ఓటమికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారూ. తదుపరి మ్యాచ్ లలో అతని పక్కన పెట్టాలి అంటూ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి విజ్ఞప్తి చేస్తున్నాడు. అయితే లక్ష్య చేదన సమయంలో అటు ఋతురాజ్ గైక్వాడ్ చెన్నైకి మంచి ఆరంభం అందించాడు. కానీ అంబటి రాయుడు శివం దూబే బంతులు వృధా చేశారు.
ముఖ్యంగా శివం దూబే 18 బంతులు ఎదుర్కొని కేవలం 19 పరుగులు సాధించాడు. దీంతో అప్పటికే జోష్ మీద ఉన్న రుతురాజ్ సైతం శివం దూబే వళ్ళ మోమెంటన్ కోల్పోయాడు అని చెప్పాలి. సెంచరీ చేస్తాడు అనుకుంటే చివరికి వికెట్ కోల్పోయాడు. దీంతో ధోని అభిమానులకు ఒక్క సిక్సర్ కూడా చూసే అవకాశం లేకుండా పోయింది. దీంతో దూబే కారణంగానే చెన్నై ఓడిపోయిందని అతని పక్కన పెట్టాలి అంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తుషార్ దేశ్పాండే సైతం నో బాల్స్ వేసి అటు పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.