సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటేనే యంగ్ ప్లేయర్స్ విధ్వంసానికి మారుపేరు అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ప్రతి ఏడాది ఐపీఎల్ సీజన్లో కూడా ప్రపంచ క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు ఆడుతూ ఉంటారు. అయితే ఇలా ప్రతి సీజన్లో స్టార్ ప్లేయర్స్ బాగా రాణిస్తారో లేదో చెప్పలేం కానీ ప్రతి ఐపీఎల్ సీజన్లో అటు యంగ్ ప్లేయర్స్ మాత్రం హవా నడిపిస్తూ ఉంటారు.. దేశం తరఫున ప్రాతినిధ్యం వహించాలి అనే కలగనే యంగ్ ప్లేయర్స్ ఇక ఆ కలను సహకారం చేసుకునేందుకు ఐపీఎల్ ద్వారా వచ్చిన అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బౌలర్లు ఎక్కువ వికెట్లు తీసి రికార్డులు చేస్తే ఇక బ్యాట్స్మెన్లు బౌలర్ల పై వీర విహారం చేసి ఎన్నో రికార్డులను కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్లో కూడా ఎంతోమంది యంగ్ ప్లేయర్స్ తమ ప్రదర్శనతో సెన్సేషన్ సృష్టించారు అనడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా ఐపీఎల్ 16వ సీజన్లో మంచి ప్రదర్శన చేసి వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్లలో సాయి సుదర్శన్ కూడా ఒకరు అని చెప్పాలి. చెన్నైకి చెందిన ఈ క్రికెటర్ ప్రస్తుతం ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఐపీఎల్ లో వచ్చిన అవకాశాన్ని అతను బాగా చదివినియోగం చేసుకున్నాడు.


 తాను టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అన్న విషయాన్ని తన ప్రదర్శనతో నిరూపించాడు. ఇక ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో కూడా 47 బంతుల్లోనే 8ఫోర్లు నాలుగు సిక్సర్లతో వీరవిహారం చేసి 96 పరుగులు చేశాడు.  చెన్నై బౌలర్లు అందరిని కూడా భయపెట్టించాడు అని చెప్పాలి. అయితే చెన్నై తో మ్యాచ్ ఆడడం గురించి ఇటీవలే మాట్లాడాడు సాయి సుదర్శన్. అతను పెట్టిన పోస్ట్ కాస్త ధోని అభిమానులను ఫిదా చేస్తుంది. మహేంద్రసింగ్ ధోనితో ఒక్కసారైనా కలిసి  ఆడాలన్న నా చిన్ననాటి కల ఇటీవల ఐపీఎల్ ద్వారా నెరవేరింది అంటూ సాయి సుదర్శన్ పోస్ట్ పెట్టాడు. ఇక ఈ పోస్ట్ చూసి అదృష్టవంతుడివి అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: