
అయితే జూన్ 7వ తేదీ నుంచి అటు ఆస్ట్రేలియా జట్టు ఇంగ్లాండ్ లోని లండన్ వేదికగా భారత జట్టుతో డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించి విశ్వవిజేతగా నిలవాలని పట్టుదలతో ఉంది. అయితే ఇక డబ్ల్యూటీసి ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత అటు ఇంగ్లాండ్ టీం తో సిరీస్ లో తలబడబోతుంది ఆస్ట్రేలియా జట్టు. ఈ క్రమంలోనే అటు ఇంగ్లాండ్ ఇటు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులు కూడా ఈ యాషెష్ సిరీస్ కోసం ఇక జట్టు వివరాలను కూడా ప్రకటించారు. అయితే ఇటీవల ఇంగ్లాండు క్రికెట్ బోర్డు ఇలా టీం వివరాలను ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఊహించని షాక్ తగిలింది అని చెప్పాలి.
ఎందుకంటే జట్టులో కీలక ప్లేయర్ గా ఉన్న ఆటగాడు ఇక గాయం బారిన పడి జట్టుకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇలా ఈ యాషెష్ సిరీస్ కోసం ఇంగ్లాండు జట్టులో చోటు సంపాదించుకున్న స్పిన్నర్ జాక్ లీచ్ గాయం కారణంగా ఇక సిరీస్ మొత్తానికి కూడా దూరమయ్యాడు. ఐర్లాండ్‌తో ప్రస్తుతం ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ టెస్ట్ సిరీస్ లో పూర్తి ఆధిపత్యాన్ని కనబరుస్తుంది ఇంగ్లాండ్. అయితే ఇటీవల ఐర్లాండ్‌తో టెస్ట్ సందర్భంగా ఇక స్పిన్నర్ జాక్ లీచ్ నడుముకి గాయమైనట్లు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు తెలిపింది. అతని స్థానంలో మరో ప్లేయర్‌ని త్వరలోనే ప్రకటిస్తాము అంటూ చెప్పుకొచ్చింది. కాగా ఈనెల 16వ తేదీ నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య యాషెష్ సిరీస్ జరగబోతుంది.