
ప్రస్తుతం భారత క్రికెట్లో యంగ్ సెన్సేషన్ గా కొనసాగుతున్న శుభమన్ గిల్ కి సంబంధించిన వార్త కూడా ఇలాగే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.. శుభమన్ గిల్ సారా తో డేటింగ్ లో ఉన్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో కూడా అందరిలో కన్ఫ్యూజన్ నెలకొంది. సైఫ్ అలీఖాన్ కూతురు పేరు సారా అలీ ఖాన్ కావడం.. ఇక సచిన్ టెండూల్కర్ కూతురు పేరు సారా టెండూల్కర్ కావడంతో ఈ ఇద్దరిలో ఎవరు గిల్ తో డేటింగ్ లో ఉన్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఇక గిల్ రిలేషన్షిప్ గురించి మాత్రం ఎప్పుడూ ఎన్నో రకాల వార్తలు తిరమీదికి వస్తూనే ఉంటాయి.
అయితే శుభమన్ గిల్ తో డేటింగ్ వార్తలపై బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ ఇటీవలే పరోక్షంగా స్పందించారు. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సారా తనకు కాబోయే లైఫ్ పార్టనర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నా లైఫ్ పార్ట్నర్ ను ఇంకా కలవలేదని.. కచ్చితంగా చెబుతున్నా. పెళ్లి విషయంలో మీ నాన్నమ్మ షర్మిల ఠాగూర్ ను అనుసరిస్తారా అంటూ ప్రశ్నించగా.. నా మానసిక విలువలకు సరితూగే వ్యక్తిని పెళ్లి చేసుకుంటా.. అతను ఏ రంగమైనా పట్టించుకోను అంటూ సారా టెండూల్కర్ చెప్పుకొచ్చింది.