ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ కి సంబంధించిన షెడ్యూల్ పై కూడా ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే ఇప్పటికే కొన్ని జట్లు వరల్డ్ కప్ కోసం క్వాలిఫై అయ్యాయి. కానీ మరికొన్ని జట్లు మాత్రం ఇక వరల్డ్ కప్ లో ఆడేందుకు ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతూ ఉండడం గమనార్హం. ఇక ఇప్పుడు ఈ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ప్రతి టీం కూడా ఇక వరల్డ్ కప్ లో ఆడే అవకాశాన్ని దక్కించుకోవడం కోసం హోరాహోరీగా పోరాడుతూ ఉండడం చూస్తూ ఉన్నాం.



 నిజంగా వరల్డ్ కప్ జరుగుతుందేమో అనేంతలా ఇక క్వాలిఫైయర్ మ్యాచ్ లు కూడా ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్ లో భాగంగా ఇటీవల ఐర్లాండ్, స్కాట్లాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లుగా సాగింది అని చెప్పాలి. ఎవరు విజేతగా నిలుస్తారు అన్న విషయం చివరి బంతి వరకు కూడా ప్రేక్షకుల ఊహకిందని విధంగా మారిపోయింది. చివరి బంతి వరకు ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్లో ఆఖరి బంతికి ఇక స్కాట్లాండ్ విజయం సాధించింది అని చెప్పాలి.


 ఇక ఈ మ్యాచ్ ప్రేక్షకులకు  అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది. 287 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. మైకేల్ లిస్ట్ 91, మైక్ బ్రెడ్ 56, మార్క్ వార్డ్ 47 పరుగులు చేసి రాణించారు.  అంతకుముందు ఐర్లాండ్ బ్యాట్స్మెన్ కర్రిస్ కంఫర్ట్ 120 సెంచరీ చేయగా.. ఇక జట్టు ఓడిపోవడంతో అతని సెంచరీ వృధాగానే మారిపోయింది అని చెప్పాలి. అయితే ఐర్లాండ్ స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి తెలిసిన తర్వాత క్వాలిఫైయర్ మ్యాచ్ల లోనే ఇంత ఉత్కంఠ ఉంటే.. ఇక అటు అధికారిక వరల్డ్ కప్ మ్యాచ్ లలో ఇంకా ఎలాంటి మజా దొరుకుతుందో అని ప్రేక్షకులు  భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Icc