పసికూన టీంలు సైతం వెస్టిండీస్ ను చిత్తుగా ఓడిస్తూ ఉండడం చూసి అటు ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోతున్నారు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ను శాసించిన వెస్టిండీస్ ఇక ఇప్పుడు ఆ వైభవాన్ని కోల్పోయింది. జట్టులో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఉన్నప్పటికీ వెస్టిండీస్ మాత్రం ప్రత్యర్థులకు కనీస పోటీ ఇవ్వలేక పోతుంది. అయితే ఆ జట్టు ప్లేయర్లు మిగతా దేశాల టి20 లీగ్ లలో అదరగొడుతున్న.. ఎందుకో వెస్టిండీస్ జట్టు తరఫున మాత్రం ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయడం లేదు. ఇలాంటి చెత్త ప్రదర్శన కారణంగానే ఒకప్పటి భయంకరమైన వెస్టిండీస్ టీం ఇటీవల కనీస వన్ డే ప్రపంచ కప్ కూడా క్వాలిఫై కాలేకపోయింది.
ఈ క్రమంలోనే వెస్టిండీస్ ప్రదర్శన పై ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం మొత్తం విమర్శలు చేస్తూ ఉంది అని చెప్పాలి. ఇదే విషయం గురించి టీమ్ ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. వెస్టిండీస్ జట్టు ప్రపంచ కప్ కు అర్హత సాధించకపోవడం నిజంగా సిగ్గుచేటు. జట్టులో నైపుణ్యం ఉంటే సరిపోదు.. పాలిటిక్స్ వెస్టిండీస్ జట్టును పూర్తిగా దెబ్బతీసాయి. క్రికెట్ లోకి రాజకీయాలు ఎంటర్ అయితే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో అనేదానికి వెస్టిండీస్ ఉదాహరణ. ఇంతకు మించి ఆ జట్టు పడిపోవడానికి ఇంకేమీ లేదు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి