ఇలాంటి సమయంలో గత కొంతకాలం నుంచి వరల్డ్ కప్ షెడ్యూల్ విషయంపై ఒక ఆసక్తికర చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. సాధారణంగా అయితే చిరకాల ప్రత్యర్ధులు అయినా పాకిస్తాన్ ఇండియా పోరు అక్టోబర్ 15వ తేదీన నరేంద్ర మోడీ స్టేడియంలో జరగాల్సి ఉంది. కానీ ఇక భద్రత కారణాల దృశ్య ఈ మ్యాచ్ షెడ్యూల్ను మార్చే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే కేవలం పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ కి సంబంధించిన షెడ్యూల్ మాత్రమే మారుస్తారా లేదా ఇక పూర్తి షెడ్యూల్లో మార్పులు చేస్తారా అనే విషయంపై గత కొంతకాలం నుంచి కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయం గురించి బిసిసిఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు అని చెప్పాలి.
ఈ క్రమంలోనే ప్రపంచ కప్ షెడ్యూల్ గురించి కీలక ప్రకటన చేశారు. ప్రపంచ కప్ తేదీలలో మార్పులు ఉంటాయి అంటూ స్పష్టం చేశారు. అయితే కొత్త షెడ్యూల్ 2 లేదా మూడు రోజుల్లో రిలీజ్ చేస్తాము అంటూ వెల్లడించారు. మరి కొన్ని రోజుల్లో అటు టికెట్ బుకింగ్ కూడా ప్రారంభమవుతాయి అంటూ తెలిపారు. ఈ క్రమంలోనే ప్రేక్షకులందరికీ ఉచితంగా తాగునీరు అందించే సౌకర్యాన్ని కూడా కల్పిస్తున్నాము అంటూ తెలిపాడు. అదే సమయంలో భారత స్టార్ బౌలర్ బుమ్రా పూర్తిగా ఫిట్గా ఉన్నాడని జై షా భారత్ ఫ్యాన్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి