అంతేకాదు ఇతర దేశాల క్రికెట్ బోర్డులు నిర్వహించే దేశీయ లీగ్ లలో ఐపీఎల్ లో రాణించిన ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉంటుంది అని చెప్పాలి. ఇక అన్ని ఫ్రాంచైజీలు వారిని భారీ ధర పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధం అవుతూ ఉంటాయి అని చెప్పాలి. అయితే ఇలా ఐపిఎల్ లో రాణించిన కొంతమంది ఆటగాళ్లు మిగతా లీగ్ లలో మాత్రం తుస్సు మనిపించడం చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు ఐపీఎల్ లో అదరగొట్టి భారీ పరుగులు చేసిన ఒక స్టార్ ప్లేయర్ మరో లీగ్ లో మాత్రం తుస్సుమనిపించాడు. ఆ ప్లేయర్ ఎవరో కాదు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కెప్టెన్గా వ్యవహరిస్తున్న డూప్లెసెస్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ గా ఏకంగా 730 పరుగులతో రాణించాడు. ప్రస్తుతం అమెరికన్ మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో భాగమయ్యాడు డూప్లెసెస్. అక్కడ మాత్రం తన ప్రదర్శనతో చిరాకు తెప్పిస్తున్నాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న డూప్లెసెస్ ఆడిన ఏడు మ్యాచ్లలో కేవలం 46 పరుగులు మాత్రమే చేశాడు. ఈ టోర్నీలో అతని అత్యధిక స్కోరు 14 మాత్రమే కావడం గమనార్హం. కీలకమైన నాకౌట్ మ్యాచ్లలో సైతం ఆరు పరుగుల మాత్రమే చేశాడు. దీంతో నాకౌట్ మ్యాచ్లలో ఓడిపోయిన టెక్సాస్ సూపర్ కింగ్స్ చివరికి టోర్ని నుంచి నిష్క్రమించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి