ఏకంగా వెన్నునొప్పి గాయం కారణంగా జట్టుకు దూరమైన బుమ్రా మధ్యలో ఒకసారి పునరాగమనం చేశాడు. కానీ ఒక్క మ్యాచ్ లోనే పాత గాయం తిరగబెట్టడంతో చివరికి సర్జరీ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అతను లేకుండానే అటు టీమిండియా కొన్ని మేజర్ టోర్నీలు కూడా ఆడి విఫలం అయింది అని చెప్పాలి. ఇక అతను వస్తే తప్ప టీమిండియా బౌలింగ్ విభాగం పటిష్టంగా మారదు అని ఎంతో మంది మాజీలు కూడా అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే దాదాపు 11 నెలల తర్వాత మళ్లీ భారత జట్టులోకి పునరాగమనం చేశాడు బుమ్రా.
ఐర్లాండ్ పర్యటనలో భాగంగా భారత జట్టుకు ఎంపిక కావడమే కాదు కెప్టెన్సీ బాధ్యతలను కూడా చేపట్టాడు. అయితే ఇన్ని నెలలు గ్యాప్ తీసుకున్న బుమ్రా మళ్లీ మునుపటి ఫామ్ ను అందుకోలేడని.. ఇక వరల్డ్ కప్ ఆసియా కప్ కు సెలక్ట్ అవ్వడం కూడా కష్టమే అంటూ కొంతమంది విమర్శలు చేశారు. అయితే ఇలా విమర్శకుల నోళ్లు ముయించే విధంగా ఐర్లాండ్తో జరిగిన మొదటి టి20 మ్యాచ్ లోనే అదరగొట్టాడు బుమ్రా. ఇక మొదటి టి20 లో మొదటి ఓవర్ వేసి ఇక ఓకే ఓవర్ లోనే రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రత్యర్థి ఐర్లాండ్ ను దెబ్బ కొట్టాడు. దీంతో బుమ్రా ఇస్ బ్యాంక్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో వర్షం అంతరాయం కలిగించడంతో.. రెండు పరుగులు తేడాతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఇండియా విజయం సాధించింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి