ఈ క్రమంలోనే ఎన్నో కొత్త రికార్డులు క్రియేట్ అవ్వడమే కాదు.. పాత రికార్డులు కూడా బద్దలవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇటీవల వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అయితే ఈ మ్యాచ్ లో చివరి వరకు పోరాడిన నెదర్లాండ్స్ అటు న్యూజిలాండ్ పై మాత్రం విజయం సాధించలేకపోయింది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది సాధారణంగా బౌలర్ కి బ్యాట్స్మెన్ కి మధ్య కొన్ని కొన్ని సార్లు వివాదాలు తలెత్తడం చూస్తూ ఉంటాం. ఒకరిపై ఒకరు చేయి చేసుకుంటారేమో అన్నట్లుగా ఒకరి మీదకి ఒకరు దూసుకుపోతూ ఉంటారు ప్లేయర్లు.
కానీ ఇటీవల జరిగిన మ్యాచ్లో మాత్రం ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఏకంగా నెదర్లాండ్స్ బౌలర్ న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ కి వంగి మరీ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో మీక్రాన్ వేసిన బంతిని మిచెల్ బలంగా కొట్టాడు. అయితే బంతి నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లోని స్టంప్స్ కి వెళ్ళింది. షాట్ చాలా వేగంగా అంటే కళ్ళు మూసి తెరిచేలోపు దూసుకుపోయింది. దీంతో నెదర్లాండ్స్ బౌలర్ మిక్రాన్ తన చేతులను జోడించి వంగి మరి దండం పెట్టాడు. మిచెల్ కొట్టిన షాట్ అద్భుతం అంటూ చెప్పకనే చెప్పాడు. ఇది చూసి క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి