న్యూ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం నాడు ఆస్ట్రేలియా చారిత్రాత్మక ఫీట్ సాధించింది. 48 ఏళ్ల వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా జట్టు సరికొత్త చరిత్రని సృష్టించింది.న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో బుధవారం నాడు జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 309 పరుగుల భారీ తేడాతో నెదర్లాండ్స్ జట్టును ఓడించింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టీం ఏకంగా 309 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ చరిత్రలో  పరుగుల పరంగా అతిపెద్ద విజయంగా ఇది ప్రపంచ రికార్డుగా నిలిచింది.మొత్తం 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా టీం తన పాత రికార్డును తానే బ్రేక్ చేసింది. అంతకుముందు ప్రపంచకప్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన రికార్డు కూడా ఆస్ట్రేలియాదే.


మార్చి 2015లో జరిగిన ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో ఆఫ్ఘనిస్థాన్‌ టీంను ఓడించింది. ఈ జాబితాలో ఇండియా పేరు మూడో స్థానంలో నిలిచింది. మార్చి 2007లో జరిగిన ప్రపంచకప్‌లో ఇండియా 257 పరుగుల తేడాతో బెర్ముడాను ఓడించింది. దక్షిణాఫ్రికా 2015 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌ టీంను కూడా ఇదే విధమైన పరుగుల తేడాతో ఓడించింది.309 పరుగుల భారీ తేడాతో ఆస్ట్రేలియా టీం విజయం సాధించడం వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా రెండో అతిపెద్ద విజయం. వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసిన రికార్డును ఇండియా సొంతం చేసుకుంది. 2023 జనవరిలో తిరువనంతపురంలో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఇండియా ఏకంగా 317 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించి టాప్ లో వుంది. మరి ఈ రికార్డుని ఏ టీం ని బీట్ చేస్తుందో లేదా ఇండియానే తన రికార్డ్ తాను బద్దలు కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: