ఇక ధోని కెప్టెన్సీ లోనే భారత జట్టు అటు ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ధోని కెప్టెన్సీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ఎంతో మంది యంగ్ క్రికెటర్లు కూడా స్టార్ ప్లేయర్లుగా ఎదిగారు. ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంకా అతని కెప్టెన్సీకి ఉన్న క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. అయితే ధోనిని భారత జట్టుకు కెప్టెన్గా చేయడంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ దే పెద్ద హస్తం అని చాలామందికి తెలియదు. ఇక ఇటీవల ఈ విషయం గురించి బీసీసీఐ సెక్రటరీ జై షా ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు.
ఇటీవల క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కు సంబంధించిన విగ్రహాన్ని వాంకడే క్రికెట్ స్టేడియంలో ఆవిష్కరించారు అన్న విషయం తెలిసిందే. ఇక ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన జై షా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ పై ప్రశంసలు కురిపించాడు. మహేంద్ర సింగ్ ధోనిని కెప్టెన్గా చేయాలని సచిన్ తనకు సచిన్ జీ సలహా ఇచ్చాడు అంటూ జై షా చెప్పుకొచ్చాడు. నేను అప్పటికే చాలా నిర్ణయాలు తీసుకుంటే.. వాటిలో చాలా విషయాల్లో సచిన్ ఇచ్చిన సలహాలు కూడా ఉన్నాయి అంటూ జే షా తెలిపాడు. దీంతో ఈ విషయం తెలిసి ధోని అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఇక సచిన్ ఇలాంటి సలహా ఇవ్వడం వల్లే ధోని లాంటి ఒక బెస్ట్ కెప్టెన్ భారత జట్టుకు దొరికాడని.. అంతేకాదు రెండు వరల్డ్ కప్ లో కూడా భారత జట్టు గెలవగలిగింది అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు అని చెప్పాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి