విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్లో రికార్డుల రారాజు అనే పేరు ఉంది. దీనికి అంతటికి కారణం అతని కెరియర్లో అతను సాధించిన ఎన్నో అరుదైన రికార్డులే అని చెప్పాలి. ఎందుకంటే.. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు సాధించిన రికార్డులను బద్దలు కొట్టడానికి విరాట్ కోహ్లీ పుట్టాడేమో అన్న విధంగా అతని ఆట తీరు కొనసాగుతూ ఉంటుంది. ఇక ప్రతి మ్యాచ్ లో కూడా ఏదో ఒక రికార్డు బద్దలు కొడుతూ.. తన పేరు ప్రపంచ క్రికెట్లో మారుమోగిపోయేలా చేస్తూ ఉంటాడు విరాట్ కోహ్లీ. ఎంతోమంది లెజెండరీ క్రికెటర్లు కెరియర్ కాలం మొత్తంలో సాధించిన రికార్డులను కోహ్లీ మాత్రం అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తన పేరును లికించుకున్నాడు.


 ఇప్పటికే అతని ఖాతాలో వందల రికార్డులు ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా జట్టులోకి కొత్తగా వచ్చి ఏదో నిరూపించుకోవాలి అన్నట్లు కనిపించే యంగ్ ప్లేయర్ లాగే కనిపిస్తూ ఉంటాడు. ఇక అతనిలో ఉన్న ఎనర్జీ అయితే ప్రత్యర్థులను ఎప్పుడూ భయపెడుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లో సచిన్ సాధించిన 49 సెంచరీల రికార్డును బద్దలు కొట్టాలని గత కొన్ని రోజుల నుంచి ఆశ పడుతూ ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ లో భాగంగా కొన్ని మ్యాచ్లలో సెంచరీకి చేరువ అవుతున్న.. ఇక కొన్ని పరుగుల దూరంలో ఆగిపోతూ ఉన్నాడు అని చెప్పాలి.


 అయితే ఇటీవల ఈడన్ గార్డెన్స్ వేదికగా సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్లో తన పుట్టినరోజు నాడు విరాట్ కోహ్లీ సెంచరీ చేసి సచిన్ 49 సెంచరీల రికార్డును సమం చేశాడు. ఈ విషయంపై కోహ్లీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు. సచిన్ నా హీరో. ఆయన రికార్డులను సమం చేయడం గొప్ప గౌరవం. అభిమానులు మమ్మల్ని పోల్చుతూ ఉంటారు. నేను ఆయనలా ఎప్పటికీ రాణించలేను. ఎందుకంటే ఆయన బ్యాటింగ్లో చాలా పర్ఫెక్ట్. ఇది నాకు భావోద్వేగపూరితమైన క్షణం. ఇక టీవీలో ఆయన ఆటను చూస్తూ పెరిగాను అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: