సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోఎంతోమంది ప్రముఖుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన  బయోపిక్ సినిమాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. మనందరికీ తెలిసిన సెలబ్రిటీల గురించి బయోపిక్ ద్వారా తెలియని విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఇలా ఇప్పటివరకు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎన్నో బయోపిక్ సినిమాలు మంచి విజయాలను కూడా సాధించాయి. ఇక క్రికెటర్లకు సంబంధించిన సినిమాలు కూడా ఇలా ప్రేక్షకులు ముందుకు వచ్చి హిట్ అయ్యాయి అన్న విషయం తెలిసిందే.


 అయితే ప్రస్తుతం భారత జట్టులో స్టార్ ప్లేయర్ గా.. ప్రపంచ క్రికెట్ కు రికార్డుల రారాజు గా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ బయోపిక్ వస్తే బాగుండు అని అభిమానులు కూడా కోరుకుంటున్నారు. ఇక ఈ స్టార్ ప్లేయర్ బయోపిక్ సినిమా గురించి గత కొంతకాలం నుంచి ఎప్పుడు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వైరల్ గానే మారిపోతుంది. అయితే కోహ్లీ బయోపిక్ గనుక తీస్తే ఇక రన్ మిషన్ పాత్రలో ఒక వ్యక్తి సరైన వాడు అంటూ ఇప్పుడు ఒక బాలీవుడ్ హీరో చేసిన కామెంట్స్ కాస్త వైరల్ గా మారిపోయాయి. ఇటీవల జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ కి ఎంతోమంది సినీ సెలబ్రిటీగా హాజరయ్యారు.


ఈ క్రమంలోనే యానిమల్ సినిమా ప్రమోషన్స్ కోసం రణబీర్ కపూర్ కూడా స్టేడియంలో సందడి చేశాడు. ఇక కోహ్లీ బయోపిక్ గురించి అతనికి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. కోహ్లీ బయోపిక్ లో నటించాల్సి వస్తే మీరు నటిస్తారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఆసక్తికర సమాధానం చెప్పాడు ఈ హీరో. కోహ్లీ బయోపిక్ కనుక వస్తే ఆ సినిమాలో తప్పకుండా కోహ్లీనే నటించాలని ఈయన చెప్పిన సమాధానం సంచలనంగా మారింది. ఆ సినిమాలో ఆయనే బాగా సరిపోతారని.. మంచి క్రికెటర్ మాత్రమే కాదు తనలో ఒక నటుడు కూడా ఉన్నాడని రణబీర్ చెప్పుకొచ్చాడు. దీంతో అతను చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయ్. అయితే గతంలో రామ్ చరణ్ కూడా విరాట్ కోహ్లీకి అభిమానిని అని.. ఆయన బయోపిక్ లో నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా చేస్తా అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: