ఈ క్రమంలోనే పాయింట్ల పట్టికలో కూడా అగ్రస్థానంలో కొనసాగుతూ హవా నడిపించింది. అయితే టీమిండియా దూకుడు చూస్తే తప్పకుండా వరల్డ్ కప్ టైటిల్ గెలవడం ఖాయం అని అభిమానులు అందరూ కూడా గట్టిగానే ఫిక్స్ అయ్యారు. ఇక ఫైనల్లో ఆస్ట్రేలియాను టీమిడియా ఓడిస్తుందని అనుకున్నప్పటికీ.. చివరికి వరుస విజయాలతో దూసుకు వచ్చిన భారత జట్టు ఫైనల్ లో మాత్రం తడబడింది. దీంతో ఆస్ట్రేలియా టైటిల్ విజేతగా నిలిచి ఆరోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది అని చెప్పాలి.
ఈ క్రమంలోనే రోహిత్ సేనకు టైటిల్ గెలవడం అనేది మరోసారి కలగానే మిగిలిపోయింది. అయితే ఇక ఇటీవల రోహిత్ సేన వరల్డ్ కప్ ఓడిపోయిన నేపథ్యంలో.. 2011లో టైటిల్ గెలిచిన ధోని జట్టు ఇక ఇప్పుడు ఫైనల్లో ఓడిపోయిన రోహిత్ జట్టుకు మత తేడా ఏంటి అన్నది కూడా టాపిక్ గా మారిపోయింది. 2011లో ఫైనల్లో భారత బ్యాటింగ్ డెప్త్ 8వ డౌన్ వరకు ఉంది. అందులో నలుగురు పార్ట్ టైమర్లు ఉన్నారు. అయితే ఈసారి భారత జట్టులో బ్యాటింగ్ డెప్త్ ఏడు వరకు మాత్రమే ఉంది. జడేజా ఒక్కరే బౌలర్. ధోని ఏకంగా ఆ వరల్డ్ కప్ లో ఏడుగురు బోలర్ల చేతికి బంతి ఇస్తే.. రోహిత్ ఐదుగురికే పరిమితం అయ్యాడు. ఇక అప్పుడు ధోని జట్టులో ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు ఉంటే.. ఇప్పుడు మాత్రం ఒక్కరే. ఇక టీమిండియా కు మరో యువి దొరకలేదు. జహీర్ ఖాన్ లాగా ఎప్పటికప్పుడు యాంగిల్స్ చేంజ్ చేస్తే లెఫ్ట్ ఆర్మ్ ఫేసర్ ఇక రోహిత్ సేనలో లేనే లేడు. రోహిత్, ధోని జట్ల మధ్య ఇదే తేడా ఉంది అంటూ క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి