టీమిండియాలో ఎప్పుడూ ఎంతో మంది యువ ఆటగాళ్లు చోటు సంపాదించుకుంటూ ఉంటారు. ఇలా జట్టులోకి వచ్చిన ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో ఉండే ఒత్తిడిని తట్టుకోలేక చెత్త ప్రదర్శనలతో కొన్నాళ్లకే జట్టులో చోటు కోల్పోతూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రం తమ ప్రదర్శనలతో ఇక తమ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఇలా ఎలాంటి అంచనా లేకుండా యంగ్ ప్లేయర్గా జట్టులోకి వచ్చి ఇక ఇప్పుడు జట్టులో కీలక ప్లేయర్గా మారిపోయాడు యువ ఆటగాడు శుభమన్ గిల్.


 రోహిత్ శర్మతో కలిసి భారత జట్టుకు ఓపెనింగ్ చేసే ఈ యంగ్ బ్యాటర్ తన ఆట తీరుతో అందరిని ఆకట్టుకున్నాడు అని చెప్పాలి  అంతేకాదు భారత ఫ్యూచర్ స్టార్ అనే నమ్మకాన్ని కూడా అందరిలో కలిగించాడు. ఇక ఎంతో మంది భారత క్రికెట్ ప్రేక్షకులు కోహ్లీని కింగ్ అని పిలిస్తే.  ఇక గిల్ నూ యువరాజు అని పిలుస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే తన ప్రదర్శనలతో.. భారత క్రికెట్ లో మరింత హాట్ టాపిక్ గా మారిపోయాడు  అయితే వచ్చే ఐపిఎల్ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ కూడా అందుకొని ఇక ఇప్పుడు టాక్ ఆఫ్ ది క్రికెట్ గా కొనసాగుతున్నాడు గిల్.


 ఈ క్రమంలోనే భారత క్రికెట్లో స్టార్ ప్లేయర్లుగా కొనసాగుతున్న వారి ఆస్తుల వివరాలు తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే గిల్ ఆస్తి విలువ ఎంతో అభిమానులు షాక్ అవుతున్నారు. గిల్ ఆస్తుల 32 కోట్లకు చేరిందట. స్టాక్ గ్రో మేగజైన్ ప్రకారం.. గిల్ కు బిసిసిఐ వార్షిక జీతం మూడు కోట్లు.. ఐపిఎల్ నుంచి 8 కోట్లు లభిస్తున్నాయి. ఇక ఆడే ప్రతి మ్యాచ్ కు లక్షల్లోనే ఫీజు ఉంటుంది. అంతే కాదు  క్యాపియో, సియట్, జిల్లెట్ లాంటి ఎన్నో బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా  కూడా ఉన్నాడు. 1.5 కోట్ల విలువచేసే కార్లు.. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు కూడా గిల్ కు ఉన్నాయి అని సదరు మ్యాగజైన్ తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: