
ఇలా అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తున్న అందరూ క్రికెటర్లు.. కూడా ఫిట్నెస్ తో స్పూర్తిగా నిలుస్తుంటే ఒక్క క్రికెటర్ మాత్రం ఏకంగా భారీ కాయంతో అంతర్జాతీయ క్రికెట్లో రాణిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాడు. అతను ఎవరో కాదు ఆఫ్ఘనిస్తాన్ బాహుబలి గా పిలుచుకునే షహజాద్. ఫిట్నెస్ అనే మాటే అతని విషయంలో అసలు వర్తించదు. ఎందుకంటే అతను అతని ఏకంగా భారీ కాయంతో కనిపిస్తూ ఉంటాడు. వికెట్ల మధ్య పరిగెత్తడం సాధ్యం కాదు అని చెప్పాలి. కానీ అతను మాత్రం వరల్డ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్నాడు. విధ్వంసకరమైన బ్యాటింగ్తో అదరగొడుతూ ఉంటాడు అని చెప్పాలి.
అయితే ఆఫ్గనిస్తాన్ క్రికెటర్ షహజాద్ కు మహేంద్రసింగ్ ధోని ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి తీసుకోవాలని ఆఫర్ కూడా ఇచ్చాడట. ఈ విషయాన్ని ఆ దేశ మాజీ ఆటగాడు మహమ్మద్ అస్గర్ వెల్లడించాడు. 2018లో ఆసియా కప్ ట్రోఫీ డ్రాగా ముగిసిన సమయంలో ధోనితో ముచ్చటించాను అంటూ మహమ్మద్ అస్గర్ చెప్పుకొచ్చాడు. ఇక తమ దేశ ఆటగాడు షాజాద్ కు తాను పెద్ద అభిమానిని అంటూ ధోని చెప్పాడు. ఇక అతను 20 కిలోలు తగ్గితే ఐపీఎల్లో తన టీం లోకి తీసుకుంటాను అంటూ ఆఫర్ ఇచ్చాడు ధోని. కానీ ఆ తర్వాత షహజాద్ మరో 5 కిలోలు పెరిగాడు అంటూ మహమ్మద్ అస్గర్ చెప్పుకొచ్చాడు.