అయితే గత కొంతకాలం నుంచి మహేంద్రసింగ్ ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ పై ఎన్నో వార్తలు తెరమీదకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు మహేంద్రసింగ్ ధోని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఐపిఎల్ లో మాత్రం కొనసాగుతున్నాడు. అయితే ప్రతి ఐపీఎల్ సీజన్ లో కూడా ధోనీకి ఇదే ఐపీఎల్ అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వస్తున్నాయి. కానీ ధోని మాత్రం ఐపీఎల్ లో ప్రతి సీజన్లో కొనసాగుతూనే వస్తున్నాడు. అయితే ఇప్పుడు 2024 ఐపీఎల్ చివరి సీజన్ అంటూ ప్రచారం జరుగుతుంది.
అదే సమయంలో ధోని గాయం నుంచి కోలుకున్నాడా లేదా అనే విషయంపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. ఈ క్రమంలోనే ధోని భవితవ్యం గురించి చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ధోని ఐపిఎల్ కెరియర్ అతడి చేతుల్లోనే ఉంది అంటూ చెప్పుకొచ్చాడు. మోకాలి గాయం నుంచి ధోని చాలా వరకు కోలుకున్నాడు. ప్రస్తుతం ధోని పునరావాసం పొందుతున్నాడు. జిమ్లో ఇప్పటికే వర్కౌట్లు కూడా ప్రారంభించారు. మరో 10, 15 రోజుల్లో నెట్ ప్రాక్టీస్ కూడా మొదలు పెడతాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఇటీవల మీడియా సమావేశంలో పాల్గొన్న కాశీ విశ్వనాథన్ కి ఇక ధోని గాయం పై ఐపిఎల్ భవితవ్యం పై ప్రశ్నలు ఎదురయ్యాయి. కాగా కాశి విశ్వనాథన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ. ఆ విషయం తనకు తెలియదు కెప్టెన్ ధోని దీనిపై నేరుగా సమాధానం ఇస్తాడు. అతను ఏమి చేయాలనుకుంటున్నాడో ఎవరికీ చెప్పడు అంటూ కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి