ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ బ్యాట్స్మెన్ల లిస్ట్ తీస్తే అందులో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజాం పేరు కూడా మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు చెత్త ప్రదర్శనలతో అతను విమర్శలు ఎదుర్కున్నప్పటికీ ఎక్కువసార్లు మాత్రం అతను ఇక మంచి ప్రదర్శనలతో ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ జట్టులో కీలక ప్లేయర్గా వ్యవహరిస్తూ ఇక జట్టు విజయాలలో ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాడు బాబర్ అజం.


 ఒకప్పుడు పాకిస్తాన్ జట్టుని కెప్టెన్గా ముందుకు నడిపించిన ఈ ఆటగాడు.. ఇక ఇప్పుడు సారధ్య బాధ్యతలను  వదిలేసి.. కేవలం బ్యాటింగ్ మీదే దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే మొన్నటి వరకు పేలవమైన బ్యాటింగ్ తో విమర్శలు ఎదుర్కొన్న బాబర్.. ఇక ఇప్పుడు మాత్రం మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లుగానే కనిపిస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు వరకు బాబర్  తన కెరీర్ లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు  టి20 ఫార్మాట్లో ఒక అరుదైన రికార్డును కూడా అందుకున్నాడు ఈ పాకిస్తాన్ స్టార్ ప్లేయర్. పొట్టి ఫార్మాట్లో చరిత్ర సృష్టించాడు అని చెప్పాలి. సాధారణంగా పొట్టి ఫార్మాట్లో పరుగులు చేయడం ఎంత ఈజీనో.. ఇక అంతే కష్టం కూడా. ఎందుకంటే సిక్సర్లు ఫోర్ లతో   చెలరేగిపోయి ఎక్కువ పరుగులు చేయాలి అని ఆలోచనతో కొన్ని సార్లు వికెట్స్ చేజార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. అలాంటిది t20 ఫార్మాట్లో ఎక్కువ పరుగులను తక్కువ సమయంలో సాధించడమంటే నిజంగా గొప్ప విషయమే. ఇలాంటి రికార్డునే సాధించాడు బాబర్. టి20 ఫార్మాట్లో అత్యంత వేగంగా 10,000 పరుగులు మార్కును అందుకున్న తొలి బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. 280 మ్యాచ్లలోనే బాబర్ ఈ ఘనత సాధించాడు. ఇక రెండో స్థానంలో క్రిస్ గేల్ ఉన్నాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: