ప్రస్తుతం టీమిండియా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే విదేశీ పర్యటనకు వెళ్లిన లేదంటే ఇక సొంత గడ్డపై మ్యాచ్లు ఆడిన టీమిండియాదే ఫైచేయి అన్న విధంగా ప్రస్తానాన్ని కొనసాగిస్తుంది. ఫార్మాట్ తో సంబంధం లేకుండా సిరీస్లను గెలుచుకుంటూ.. ఇక తమకు తిరుగులేదు అని నిరూపిస్తోంది. మొన్నటికి మొన్న అటు సౌత్ ఆఫ్రికా పర్యటన ముగించుకున్న టీమిండియా అక్కడ టెస్ట్  సిరీస్ ను కైవసం చేసుకుంది అన్న విషయం తెలిసిందే. ఇది ముగిసిన వెంటనే ఇక స్వదేశంలో ఆఫ్గనిస్తాన్ తో టి20 సిరీస్ ఆడి ఇక ఈ సిరీస్ ను కూడా క్లీన్ స్వీప్ చేసింది. ఇక ఇప్పుడు ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో కూడా ఘనవిజయాన్ని అందుకుంది టీమిండియా.


 ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో మొదటి మ్యాచ్ లో కాస్త తడబడినట్లు కనిపించి ఓడిపోయినప్పటికీ.. ఆ తర్వాత మూడు మ్యాచ్లలో మాత్రం అద్భుతంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే ఇక 3-1 తేడాతో ఇప్పటికే సిరీస్ ను కైవసం చేసుకుంది టీం ఇండియా. దీంతో వరుసగా ఏకంగా సొంత గడ్డపై 17 టెస్టు సిరీస్లను కైవసం చేసుకుని అరుదైన రికార్డును కూడా సృష్టించింది అని చెప్పాలి. అయితే పలువురు కీలక ఆటగాళ్లు గాయం బారిన పడి జట్టుకు దూరమైనప్పటికీ అటు టీమిండియా మాత్రం సిరీస్ ను కైవసం చేసుకోవడం గమనార్హం.


 అయితే ఇక ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ కి విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలవల్ల సెలవుల్లో ఉండి జట్టుకు దూరమయ్యాడు అన్న విషయం తెలిసిందే  అయితే ఇటీవల ఇక టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడంతో అందరూ సంతోషంలో మునిగిపోగా.. ఇక ఈ విషయంపై స్పందించాడు విరాట్ కోహ్లీ  సిరీస్ గెలుచుకున్న టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. మా యువ జట్టు అద్భుత ప్రదర్శనతో సిరీస్ కైవసం చేసుకుంది. యువ ఆటగాళ్ల పట్టుదల, దృఢ సంకల్పంతో ఆడారు అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు కోహ్లీ. ఇకపోతే విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరం అవ్వగా.. ఇక ఫిబ్రవరి 20వ తేదీన ఇక తనకు కొడుకు పుట్టినట్లు ప్రకటించాడు. ఇక కొడుకు పేరును అకాయ్ అంటూ తెలిపాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: