టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కు రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్ళు గడుస్తున్నాయి. కానీ ధోనీకి ఉన్న క్రేజ్ మాత్రం అంతకంతకు పెరిగిపోతుంది తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. ప్రస్తుతం భారత జట్టులో ఉన్న స్టార్ ప్లేయర్లతో పోల్చి చూస్తే ఇక మహేంద్రుడికే కాస్త ఎక్కువ క్రేజ్ ఉంది అని చెప్పాలి. అందరిలా సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్గా ఉండకపోయినప్పటికీ..  అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్  అవ్వకపోయినప్పటికీ.. ధోనిని దేవుడిలాగా ఆరాధించే క్రికెట్ ప్రేక్షకులు కోట్లలోనే ఉన్నారు.


 అయితే అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటర్మెంట్ ప్రకటించినప్పటికీ మహేంద్రసింగ్ ధోని ప్రస్తుతం ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా  కొనసాగుతూ ఉన్నాడు. ధోని ఐపిఎల్ రిటైర్మెంట్ పై వార్తలు వస్తున్నా ప్రతి సీజన్లోని కొనసాగుతూ అటు అభిమానులకు తన ఆట తీరితో ఎంటర్టైన్మెంట్ పంచుతూనే వస్తున్నాడు. అయితే ధోనికీ ఉన్న క్రేజ్ దృశ్య ఒక్కసారి ధోని బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగు పెట్టాడు అంటే చాలు స్టేడియం మొత్తం ధోని నినాదాలతో చెలరేగిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఇది జరిగింది. అయితే అటు rcb మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మైదానంలోకి వచ్చిన సమయంలో కూడా అభిమానుల అరుపులతో స్టేడియం రద్దరిల్లుతుంది .



 ఇకపోతే ఐపీఎల్ 17వ సీజన్లో ప్రారంభ మ్యాచ్లోనే ధోని, విరాట్ కోహ్లీలు తలబడబోతున్నారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోని కింగ్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జోస్ బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ లో ధోని కోహ్లీ మైదానంలో నడిస్తే చాలు ఫ్యాన్స్ అంతా కూడా టైలర్ స్విఫ్ట్ కన్వర్ట్ లో ఏకంగా పదేళ్ల పిల్లల లాగా మారిపోతారు. ఈ ఇద్దరు క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ నమ్మశక్యం కాని రీతిలో ఉంటుంది. ఇద్దరు క్రికెటర్లు మైదానంలో అలా నడిస్తే చాలు.. ఫ్యాన్స్ అందరి అరుపులతో స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతూ ఉంటుంది అంటూ బట్లర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: