అయినా రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు ఆట తీరు మాత్రం ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇక భారీ అంచనాల మధ్య బరిలోకి దిగుతూ వరుస ఓటములతో చివరికి అభిమానులందరినీ కూడా నిరాశ పరుస్తూ ఉంటుంది. ఇప్పుడు వరకు 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో ఒక్కసారి కూడా టైటిల్ విజేతగా నిలవలేకపోయింది బెంగళూరు టీం. అయితే కనీసం ఈ ఏడాది జరిగే ఐపిఎల్ సీషన్లో అయినా టైటిల్ గెలుస్తుందని నమ్మకం పెట్టుకున్నారు అభిమానులు. కానీ ప్రస్తుత పరిస్థితులు ఇక ఐపీఎల్ 17వ సీజన్లో కూడా బెంగళూరు టీమ్ నిరాశ పరచడం ఖాయమని అందరూ భావిస్తున్నారు.
వరుస ఓటమిలతో బెంగళూరు టీం సతమతమవుతుంది. ఇక ఎప్పటిలాగానే కోహ్లీ ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కాగా ఇటీవల రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో కోహ్లీ సెంచరీ చేశాడు. అయితే కోహ్లీ సెంచరీ చేశాడు అని మెచ్చుకోకుండా టి20 ఫార్మాట్లో ఎక్కువ బంతులు వృధా చేస్తూ సెంచరీ చేశాడు అంటూ అందరూ విమర్శలు చేశారు. అయితే ఇదే విషయం గురించి కోహ్లీ స్పందించాడు. వికెట్ కాస్త ఫ్లాట్ గా ఉండడంతో చివరి వరకు ఆడాలని భావించాను పరిస్థితులకు అనుగుణంగా పరిణితితో ఉన్నాను. ఇక్కడ ఎక్కువ రన్స్ రాబట్టలేం. ముఖ్యంగా చాహల్, అశ్విన్ బౌలింగ్ లో నేను రన్స్ చేయలేకపోయా. ఈ పిచ్ పై 183 టార్గెట్ అన్నది బెటర్ అనిపించింది అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి