ప్రస్తుతం టీమిండియా లో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న ఆటగాళ్లు ఎవరు అంటే.. ముందుగా విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మ పేర్లు వినిపిస్తూ ఉంటాయి. ఈ ఇద్దరు దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టీమ్ ఇండియాకు ప్రాతినిథ్యం వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు రెండు పిల్లర్లుగా కొనసాగుతూ ఉన్నారు. ఎన్నో ఏళ్ళ పాటు విరాట్ కోహ్లీ టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇక ఆ తర్వాత  కోహ్లీ నుంచి సారధ్య బాధ్యతలను అందుకొని సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపిస్తూ ఉన్నాడు రోహిత్ శర్మ.


 అయితే ఈ ఇద్దరు ప్లేయర్లు ప్రస్తుతం రిటైర్మెంట్ దశలో ఉన్నారు అంటూ గత కొంతకాలం నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇక వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి ఇద్దరు సీనియర్లు భారత జట్టులో కనిపించే అవకాశాలు తక్కువ అని ఎంతమంది క్రికెట్ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. కానీ ఈ ఇద్దరు సీనియర్ ప్లేయర్లు మాత్రం ఇప్పటివరకు రిటైర్మెంట్ పై స్పందించింది లేదు. కాగా ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా కొనసాగుతున్న రోహిత్ శర్మ.. రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయాయి.


 ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన తనకు లేదు అంటూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. ప్రస్తుతం నా ప్రదర్శన బాగానే ఉంది. మరికొన్నెళ్ళు ఆటలోనే కొనసాగుతాను. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించి జట్టును గెలిపించాలి. అలాగే మరో వరల్డ్ కప్ కూడా సాధించాలి. ఈ రెండు నెరవేరుతాయి అని ఆశిస్తున్నా.. ఈ రెండు పూర్తయిన తర్వాతే రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తాను అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. బ్రేక్ ఫాస్ట్ విత్ ఛాంపియన్స్ కార్యక్రమం లో హిట్ మ్యాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: