ఈ క్రమంలోనే ఒలంపిక్స్ లో పాల్గొనే సమయం వచ్చినప్పుడు ఒత్తిడిని జయించి అత్యుత్తమ ప్రదర్శనతో మెడల్ సాధించడం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు వరకు ఇలా ఒలంపిక్స్ లో ఎంతో మంది క్రీడాకారులు గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ బ్రాంచ్ మెడల్ సాధించడం చూసాము. కానీ ఒకే మెడల్ ని ఏకంగా ఇద్దరు క్రీడాకారులు సాధించడం గురించి ఎప్పుడన్నా విన్నారా.. అదేంటి ఒలంపిక్స్ లో అలా ఎలా కుదురుతుంది. ఒక మెడల్ కేవలం ఒక అథ్లేట్ కి మాత్రమే కేటాయిస్తారు కదా అంటారా.. ఒలంపిక్స్ క్రీడల్లో ఒకసారి గోల్డ్ మెడల్ను ఇద్దరు క్రీడాకారులు షేర్ చేసుకున్న ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన వార్త కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి
.
సాధారణంగా అయితే ఒలంపిక్స్ లో ఏ విభాగంలో అయినా గెలుపొందిన వారికి గోల్డ్ మెడల్ దక్కుతుంది. కానీ 2020 టోక్యో ఒలంపిక్స్ లో మాత్రం పురుషుల హై జంప్లో ఇద్దరు క్రీడాకారులకు బంగారు పతకం దక్కింది. అదెలా అంటే ఖతార్కు చెందిన ముంతాజ్ ఎస్సా భర్సిం ఇటలీకి చెందిన జియాన్ మార్కో టాంబరి హై జంప్లో 3.37 మీటర్ల ఎత్తు జంప్ చేశారు. దీంతో పోటీలో కొనసాగుతారా గోల్డ్ మెడల్ ను పంచుకుంటారా అని రిఫరి అడగగా మెడల్ ను పంచుకునేందుకు ఇద్దరు క్రీడాకారులు అంగీకరించారు. దీంతో ఒకే గోల్డ్ మెడల్ ఇద్దరికీ వచ్చేసింది.