ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... కుల్దీప్ యాదవ్ అలాగే  కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్ మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలోనే రింకు సింగ్ చెంప పగలగొట్టాడు కుల్దీప్ యాదవ్. దీనికి సంబంధించిన సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ జెట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే.

 అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో.... ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు పైన కోల్కతా నైట్ రైడర్స్ జట్టు విజయం సాధించింది. 14 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది కేకేఆర్. తప్పక గెలవాల్సిన ఈ మ్యాచ్లో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ అనంతరం ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. కోల్కత్తా నైట్ రైడర్స్ ఆటగాడు  రింగు సింగ్ చెంప పగలగొట్టాడు  ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కుల్దీప్ యాదవ్. మ్యాచ్ అయిపోయిన తర్వాత రెండు జట్ల ప్లేయర్లు మాట్లాడుతుండగా ఈ సంఘటన జరిగింది.

 కేకేఆర్ ఆటగాళ్లు అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లేయర్లు ఒకే దగ్గరికి చేరుకున్నారు. ఈ సందర్భంగా.. రింకు సింగ్ మాట్లాడుతుండగా అతడి... చెంపపై గట్టిగా కొట్టాడు ఢిల్లీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన రింకు సింగ్...చాలా సీరియస్ అయ్యాడు.  అయితే అంతలోపే మరోసారి కూడా చెంప పైన కొట్టాడు.  ఇక అనంతరం రింకు సింగ్ అలాగే కుల్దీప్  యాదవ్ మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగినట్లు తెలుస్తోంది.

 ఆ సమయంలో.... ఇరుజట్ల కెప్టెన్లు జోక్యం చేసుకోవడంతో ఈ గొడవ సద్దుమణిగినట్లు చెబుతున్నారు. కానీ చెంపదెబ్బ కొట్టిన వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుర్ర క్రికెటర్ ను పట్టుకొని చెంపదెబ్బ ఎలా కొడతావని కుల్దీప్ యాదవ్ ను  ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. అంతకుముందు మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ వేసిన బౌలింగ్లో ఏకంగా 22 పరుగులు చేశాడు రింకు సింగ్. అయితే ఆ పగ తీర్చుకునేందుకే ఇలా కొట్టాడని అంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: