2025 ఐపీఎల్ సీజన్ చివరికి రానే వస్తోంది. ఈ రోజున క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ జరగబోతోంది ఇందులో క్వాలిఫైయర్ మ్యాచ్లలో భాగంగా పంజాబ్ కింగ్స్ - బెంగళూరు టీమ్ తలబడుతున్నన్నాయి. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు మొదలు కాబోతోంది. చండీగర్ వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది.అయితే ఇప్పటికే ఈ మ్యాచ్ కు సంబంధించిన అన్ని పనులను కూడా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ మ్యాచ్ ని మరింత ఉత్కంఠ పరిచేలా ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదే వరుణ దేవుడు.


పంజాబ్ కింగ్స్ , బెంగళూరు టీమ్ తలబడుతున్న సమయంలో ఈ మ్యాచ్కు వర్షం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని ఇప్పుడు ఇరువురు జట్ల అభిమానుల  మధ్య సందేహం మొదలైంది.. ముఖ్యంగా రిజర్వ్ డే లేకపోవడంతో ఖచ్చితంగా ఎవరో ఒకరిని విన్నర్గా  ప్రకటించాల్సి ఉన్నది.. అయితే పాయింట్ల పట్టిక ప్రకారం చూసుకున్నట్లు అయితే మొదటి స్థానంలో పంజాబ్ కింగ్స్ ఉన్న నేపథ్యంలో.. కచ్చితంగా విజేతగా పంజాబ్ కింగ్స్ ను మాత్రమే ప్రకటించే అవకాశం ఉన్నది. దీంతో పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరుతుంది.


అయితే వర్షం పడి మ్యాచ్ ఆగిపోతేనే పంజాబ్ కింగ్స్ ఫైనల్ కి చేరుతుంది. ఇక మిగిలిన బెంగళూరు టీమ్ క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. ఎలిమినేటర్లు గెలిచిన జట్టు(ముంబై లేదా గుజరాత్ ఉండవచ్చు) వీటితో బెంగళూరు టీం తరబడి అప్పుడు గెలిచినవారు నేరుగా ఫైనల్ కి వెళుతుంది. తొలి కప్పు వేటలో ఉన్నటువంటి పంజాబ్, బెంగళూరు టీం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని చాలా పట్టుదలతో కనిపిస్తున్నారు.. ఒకవేళ వర్షం  పడితేనే ఈ ఐపీఎల్ మ్యాచ్ కు ఇబ్బంది.. పడకపోతే యధావిధిగా కొనసాగుతుంది..అయితే అభిమానులు మాత్రం ఈరోజు వర్షం రాకూడదని ఇరువురు జట్ల అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: