
ఈ సారి కప్ నమదే.. అనే నినాదం మాటలకే కాకుండా నిజంగా మారింది. ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ (Royal Challengers Bangalore) పంజాబ్ కింగ్స్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించి తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని అందుకుంది. ఈ విజయంతో ఒక్క ఆర్సీబీ అభిమానులే కాదు, టీమ్‌కు స్వేదం, ప్రాణం సమర్పించిన అయిన విరాట్ కోహ్లీ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అయ్యాడు. కోహ్లీకి ఇది సుదీర్ఘంగా ఎదురుచూసిన క్షణం.
కానీ, ఈ ట్రోఫీ గెలుపు ఒకరి వ్యక్తిగత జీవితానికీ అసలైన ఊపిరిలా మారింది. ఎందుకంటే, కొద్ది రోజుల క్రితం లక్నో స్టేడియంలో జరిగిన ఆర్సీబీ vs లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు చిరాయా అనే మహిళ ఒక ఆసక్తికరమైన పోస్టర్‌తో హాజరైంది. ఆమె తన చేతిలో పట్టిన ప్లకార్డులో “ఆర్సీబీ ఫైనల్ గెలవకపోతే నా భర్తకి తలాక్ ఇస్తా” అని రాసి ఉండటంతో, అక్కడ ఉన్నవాళ్లు షాక్ తిన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.
చిరాయా ఎవరో కాదు… ఆర్సీబీకి పిచ్చి ఫ్యాన్. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఆ విషయంలో ఎలాంటి సందేహం ఉండదు. అందుకే, ఆర్సీబీ గెలవకపోతే ఆమె భర్తకు నిజంగా విడాకులు ఇచ్చేదేమో అనే భయం అందరికి కలిగింది. కానీ, ఆఖరుకి దేవుడి దయతో కానీ, ఆర్సీబీ ప్లేయర్ల అద్భుత ప్రదర్శనతో కానీ, జట్టు గెలిచింది. దీనితో భర్త విడాకుల నుండి సేఫ్ అయ్యాడు. ఇక చిరాయా ఆనందంలో మునిగిపోయి కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసింది. నిజానికి ఇది సాధారణ విజయం కాదు… 18 ఏళ్ల నిరీక్షణకు ముగింపు. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్సీబీ ఇప్పటివరకు 10 సార్లు ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. కానీ, 2009, 2011, 2016 ఫైనల్స్ వరకు వెళ్లినా గెలుపు దక్కలేదు. ఈసారి మాత్రం ఆ జట్టు చారిత్రక విజయం సాధించింది. దీనిపై ఆర్సీఐబి అభిమానులు పెద్దెత్తున ఆనందం వ్యక్తం చేశారు. ఈ విజయం కేవలం ఆటగాళ్లకే కాదు… అభిమానులకూ, కోహ్లీకి, కట్టుబాటు ఉన్న ఫ్యాన్స్‌కూ నిజంగా ఓ మధుర జ్ఞాపకం.