అయితే ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్నానని ఫ్రష్ట్రేషన్ అవుతున్నాడో ఏమో తెలియదు కానీ సొహైల్ ఓ రేంజ్‌లో విరుచుకు పడుతున్నాడు. అయితే ఇప్పటికే అభి, దివి, సుజాతలతో గొడవ పడ్డాడు. ఇక నేటి రాత్రి ఎపిసోడ్‌లో రాజశేఖర్ మాస్టర్‌ని ఎక్కువ మాట్లాడితే రెండు పీకుతా అన్నట్టుగా దూసుకుపోయాడు సొహైల్.
అయితే ఈ గేమ్‌లో దివి-రాజశేఖర్ మాస్టర్ కంబైండ్‌గా ఆటాడుతుండటంతో.. వాళ్లని నిలువరించే ప్రయత్నం చేస్తున్నాడు సొహైల్. ఇక ఏమైందో ఏమో కాని.. ఒకర్నే టార్గెట్ చేసి ఆట ఆడితే కథ వేరేలా ఉంటుందని రాజశేఖర్ మాస్టర్‌కి హెచ్చరించడంతో.. రాజశేఖర్ మాస్టర్ ఏంట్రా కథ వేరే ఉండేది అంటూ దూసుకుని వచ్చాడు సోహైల్. ఇక వద్దు మాస్టర్ వద్దు.. సొహైల్ మీదికి రావడంతో.. ఏంట్రా కొడతావా?? రారా అంటూ సైసై అంటున్నాడు రాజశేఖర్ మాస్టర్. ఇక ప్రోమో అయితే మంచి హీట్‌గానే ఉంది కాని చెప్పొచ్చు. అక్కడ విషయం ఏం ఉండదనేది గత ఎపిసోడ్ ప్రోమోలను బట్టి అంచనాకు రావొచ్చునాని నిపుణులు తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి