బిగ్ బాస్ లో మొదలైన నామినేషన్ రణరంగం...సీజన్ 4 లో ఎన్నడూ లేని విధంగా రాజుకున్న   వివాదం.ఈసారి సోమవారం నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య వాతావరణం ఎంత వేడెక్కిందంటే ప్రతి ఒక్క ఇంటి సభ్యుడు ఈ నామినేషన్ సందర్భంలో ఫైర్ అయ్యారు.ఎప్పుడు ఎంత సరదాగా ఉంటూ అందరినీ నవ్వించే అవినాష్ కూడా మోనాల్ పై కోపంతో వాదనకు దిగాడు. హౌస్ మొత్తం అలా అలా యాంగ్రీ మూడ్ లోకి స్లిప్ అయిందనే చెప్పాలి.


సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటిసభ్యులందరు గార్డెన్ ఏరియాలో నిలుచున్నారు. ఆతరువాత బిగ్ బాస్ ఇంటిసభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటారో వారి ముఖానికి మొదటగా క్రీం పూసి తదుపరి కారణాలు చెప్పాల్సిందిగా ఆదేశిస్తారు.. అలా మొదలైన నామినేషన్  ప్రక్రియ అఖిల్ తో ప్రారంభం అయింది....అవినాష్ తొలుత మోనాల్ ని నామినేట్ చేయగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది...అన్నింటినీ పాజిటివ్ గా తీసుకునే అవినాష్ సైతం ఇక్కడ ఆగ్రహంతో ఊగిపోవడం విశేషం. నేనెప్పుడూ అందరితో సరదాగా ఉంటూ ఎదుటివారిని నవ్వించడానికి ప్రయత్నిస్తాను. కానీ దాంట్లో కూడా మీరు తప్పులు వెతికితే అది మీ ప్రాబ్లం అంటూ మోనాల్ పై విరుచుకుపడ్డాడు అవినాష్...


అభిజిత్ ..అఖిల్ ని నామినేట్ చేస్తున్న సందర్భంలో వీరివురి మధ్య ఒక మహా యుద్ధమే జరిగింది...మధ్యలో సోహెల్ కూడా తన వాయిస్ రైజ్ చేసి అభిజిత్ పై మండిపడ్డాడు...ఈ మాటల యుద్ధం జరుగుతున్న సమయంలోనే మోనాల్ పేరు చెప్పి అభిని దూషించాడు అఖిల్..అలా వీరి మధ్య మరింత వివాదం పెరుగుతున్న టైం లో...మోనాల్ గట్టిగా అరుస్తూ మీరు నామినేట్ చేసుకుంటున్నప్పుడు మీగురించే మాట్లాడుకోండి... మధ్యలో నా పేరు తెచ్చే హక్కు మీకు లేదు అసలు నా పేరు ప్రస్తావించాల్సిన అవసరం ఏంటంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
మరోవైపు దివి..లాస్యను నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ కి రియాక్ట్ అయింది లాస్య..నా వంట తిని ఇంటి సభ్యుల ఆరోగ్యం పాడయింది అంటే నేను అసలు ఒప్పుకోను అంటూ దివిని కడిగిపారేసింది....ఇలా ఇంటి సభ్యులందరూ ఈసారి నామినేషన్ ప్రక్రియలో ఎక్కువ ఎమోషన్ కి లోనై బిగ్ బాస్ ఇంటి వాతావరణాన్ని ఓ రేంజ్ లో హీటెక్కించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: